లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు ఎల్లవేళలా వుండాలి అంటే మనం ఎప్పుడూ కూడా కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఇవ్వకూడదట.ఈ 5 వస్తువులు దానం చేస్తే మన ఇంట్లో ఉండే డబ్బు అసలు నిలవదని అని చెప్తున్నారు పండితులు.. మరి ఆ వస్తువులు ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.మీ ఇంటికి వచ్చిన బంధువులకు ఈ వస్తువులు ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అందులో ముఖ్యంగా చీపురు. ఈ చీపురుని మనం ఎప్పుడు దానం చేయకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నిలబడదు. ఇక డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటాయట కొబ్బరి నూనె ను కూడా ఇవ్వకూడదు.
. మీ ఇంటికి ఇంటి సభ్యులకు కాకుండా ఇతరులకు కొబ్బరి నూనె మీ చేతులతో రాయకూడదు. కొబ్బరి నూనె ఇంటికి తీసుకు వెళ్ళమని ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుచేతనే ఎట్టి పరిస్థితుల్లో ఇది దానం చేయకూడదు.కత్తులు , సూదులు, పదునైన వస్తువులను కూడా మనం ఎవ్వరికీ దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వారికి దురదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది . ఆ ఇంట్లో కొన్ని కలహాలు కూడా రావచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు.మరీ ముఖ్యంగా పాడైపోయిన ఆహారపదార్థాలను అసలు దానం చేయకూడదట. ఇలాంటివి దానం చేయడం వల్ల కోర్టు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.
ఇక వారి దగ్గర ఉండేటువంటి డబ్బు అంతా కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందట.ఇక పగిలిపోయిన వస్తువులు, చిరిగిపోయిన దుస్తులు ఎవరికి దానంగా ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల అదృష్టం అనేది కలిసి రాదు. ఏం చేసినా కూడా మనకు చెడుగానే జరుగుతుందట. ఇలాంటి వస్తువులను మన ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే బయటికి పారేయాలి.ఇక అంతే కాకుండా సాలీడు గూడు ఉండేటువంటి ఇళ్లల్లో డబ్బులు అసలు నిలబడవట. ఇక అంతే కాకుండా ఎవరి ఇంట్లో అయినా పావురాల గూడు ఉన్నట్లు అయితే ఆ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయట.