Business idea : వేసవి కాలం మొదలైంది కాబట్టి వేడి తాపాన్ని తట్టుకోవాలంటే చాలామంది చల్లటి పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి వాటిలో ఐస్ క్రీమ్ వ్యాపారం ఇప్పటికీ దేశంలో బిలియన్ డాలర్లను దాటుతుందని ఒక నివేదికలో వెల్లడైంది.సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మరీ ఎక్కువగా దీనికి డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఎవరైనా సరే బిజినెస్ చేస్తే బాగుండు అని అనుకునే వారికి ఈ వేసవి కాలంలో ఐస్ క్రీమ్ బిజినెస్ చాలా బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు. మండే ఎండల్లో చల్లని వ్యాపారం చేసి.. నెల నెలా కొన్ని వేల రూపాయలను మీరు సంపాదించవచ్చు.
ఇందుకోసం ఒక షాప్ ఉంటే సరిపోతుంది . కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో ఐస్ క్రీమ్ పార్లర్ మీరు ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ ఐస్క్రీమ్ కు డిమాండ్ పెరుగుతోంది.. కాబట్టి మీరు ఏ రేంజిలో బిజినెస్ స్టార్ట్ చేస్తే.. అంతకంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి. మీరు ఐస్ క్రీమ్ పార్లర్ ని ప్రారంభించాలని అనుకుంటే 500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా సరిపోతుంది. పదిమందికి సీటింగ్ కూడా ఏర్పాటు చేయవచ్చు. జనావాసం ఎక్కువగా ఉండే ప్రాంతంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.
ఇక చిన్న మొత్తంలో వ్యాపారాన్ని మొదలు పెట్టి వ్యాపారం జరిగే దానినిబట్టి వృద్ధి చేసుకోవచ్చు.ఇక మీరు ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు కేవలం ఇంట్లో కూర్చొని.. retail@amul.coopకి ఇ మెయిల్ చేయవచ్చు. ఇది కాకుండా http://amul.com/m/amul ఓపెన్ చేసి దరఖాస్తు చేయవచ్చు.. ఒకవేళ దీని గరించి పూర్తి సమాచారం కావాలంటే దగ్గర్లో ఉన్న అమూల్ ఐస్క్రీమ్ పార్లర్కు వెళ్లి తెలుసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చులు, మార్జిన్, ఆదాయానికి సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. ఇక నష్టం లేకుండా ఆదాయం వచ్చే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎండాకాలంలో కష్టపడకుండా లాభాన్ని పొందవచ్చు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.