Smart Phone : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న నెట్వర్క్ పేరు 5G. ఇక భారత మార్కెట్లోకి ఈ నెట్వర్క్ త్వరలోనే ప్రారంభం కానుందని .. ఇప్పటికే దేశీయ మూడు టెలికాం దిగ్గజ సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా త్వరలోనే తమ 5G సేవలను ప్రారంభిస్తున్నామని కూడా ప్రకటించాయి. ఇకపోతే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సేవలను ఆగస్టు చివరిలో కల్లా లాంచ్ చేస్తామని కొన్ని నివేదికల ద్వారా సూచిస్తున్నాయి . ఇక ఏడాది చివరిలో దేశంలో 5G నెట్వర్క్ అందుబాటులోకి రావచ్చని కూడా సూచిస్తూ ఉండడం గమనార్హం.. దేశంలో 5G నెట్వర్క్ ఊహించిన దాని కంటే త్వరగా అందుబాటులోకి వస్తుందని, 4G సేవలతో పోలిస్తే 5G స్పీడు10X ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇది వరకే వెల్లడించారు.
ఇకపోతే ఎప్పుడైనా సరే 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ను పొందాలి అంటే తప్పనిసరిగా 5G సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉండాలి. ఇకపోతే10X స్పీడ్ పొందాలి అంటే తప్పనిసరిగా 5G సపోర్టెడ్ ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ 5G నెట్వర్క్ కు సపోర్టు ఇస్తుందో? లేదో? తెలుసుకోవడం ఎలా? అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయితే తెలిసిపోతుంది.మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. Wi-Fi & Network ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు SIM & Network ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రిఫర్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ కింద ఉన్న అన్ని టెక్నికల్ లిస్టును మీరు చూడవచ్చు. ఒకవేళ మీ ఫోన్ 5G నెట్వర్క్ కు సపోర్టు ఇవ్వకుంటే ఇక మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాను పొందాలంటే కచ్చితంగా 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల్సిందే. రియల్ మీ, రెడ్మీ వంటి అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే సరసమైన ధరల్లో 5G స్మార్ట్ ఫోన్లను కేవలం రూ.15,000 లోపే అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక వాస్తవానికి ఒక నివేదిక ప్రకారం భవిష్యత్తులో రూ.10 వేల లోపు 5G స్మార్ట్ ఫోన్లు ఉంటాయని క్వాల్ కాం వెల్లడించింది. ముందుగా మీరు 5G ఫోన్ కొనే ముందు కూడా మీరు వాడే సిమ్ నెట్వర్క్ 5G కి సపోర్ట్ చేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి.