Business Idea : ఇంట్లో నుంచే బిజినెస్ చేయాలని ఉందా .. ఇరవై వేల వరకూ సంపాదించండి !

Business Idea : సొంతంగా వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలనుకుంటున్నారా ? ఇంట్లోనే ఉండి వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. అన్ని కాలాలలో ఈ వ్యాపారానికి డిమాండ్ మాత్రం తగ్గదు. ఈ వ్యాపారం మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. భారతదేశంలోని వంటగదిలో సుగంద ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని. తెలిసిందే. మీకు స్థానికంగా ఉండే ప్రజల అభిరుచులకు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మసాలాలు తయారు చేస్తే మీరు సక్సెస్ అవ్వొచ్చు.సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూప్రింట్ తయారు చేయడం జరిగింది. వీటి తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ. 3.50 లక్షలు ఖర్చవుతుంది.

300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డుకి రూ.60,000 పరికరాలు రూ.40,000 ఇవి కాకుండా పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చు రూ.2.50 లక్షలు అవసరమవుతాయి. నిధులు ఎలా సమకూర్చుకోవాలి. మీ పెట్టుబడికి అంత మొత్తం లేకపోతే.. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు ద్వారా రుణం పొందవచ్చు. ఇది కాకుండా.. ముద్ర లోన్ స్కామ్ ద్వారా కూడా రుణం తీసుకోవచ్చు. మీరు ఎంత సంపాదిస్తారంటే? నివేదిక ప్రకారం ఏడాదికి 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. క్వింటాకు రూ.500 చొప్పున ఏటా మొత్తం రూ. 10.42 లక్షలు సంపాదించవచ్చు. వీటిలో ఖర్చులన్నీ ఏటా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ. . 21 వేలకు పైగా సంపాదించుకోవచ్చు. లాభాలను ఎలా పెంచుకోవాలి.

Do you want to do business from home
Do you want to do business from home

లాభాలను ఎలా పెంచుకోవాలి ? మీ ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.మీ లాభం పెరుగుతుందని నివేదికలో చెప్పబడింది. స్థలంలో కాకుండా మీ సొంత స్థలంలో వ్యాపారం ప్రారంభించడం వల్ల ఖర్చు తగ్గుతుంది.. లాభం పెరుగుతుంది. మార్కెటింగ్ ద్వారా అమ్మకాలను పెంచుకోండి. ప్యాకింగ్ కోసం ప్యాకేజింగ్ నిపుణుడిని సంప్రదించాలి. తద్వారా వినియోగదారులను ఆకర్షించేలా మీ ప్యాకేజింగ్ ను మెరుగుపరచండి. దీంతో పాటు వినియోగదారులతో మరియు దుకాణదారులతో సంబంధాలు ఏర్పర్చుకోవాల్సిందే సోషల్ మీడియా పేజీలను కూడా తయారు చేసి మీ ప్రోడక్ట్ న్ను ప్రమోట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా బాగా క్లిక్ అయితే కోట్లల్లో లాభాలు పొందవచ్చు.