Smart TV : రూ.15000 లోపు స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూసే వారికోసం 32 అంగుళాల పరిమాణంలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ టీవీల గురించి మనం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
Power Guard 32 Inches ఫ్రేమ్ లెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ : ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచుల పరిమాణంలో లభిస్తుంది. ఇక ఫ్రేమ్ లెస్ డిజైన్ తో లభించే ఈ స్మార్ట్ టీవీ డిజైన్ పరంగా చూసుకుంటే కస్టమర్లను బాగా ఆకర్షిస్తుంది. ఇందులో 20 W సౌండ్ అవుట్ పుట్ కూడా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ రెండు హెచ్డిఎంఐ పోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇక వీటితో మీరు గేమింగ్ కన్సోల్ ను కూడా కనెక్ట్ చేయవచ్చు. Amazon Basics 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి ఫైర్ టీవీ : ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇక లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ టీవీ అన్ని ఓటీటీ యాప్ లకు మద్దతు ఇస్తుంది. ఇన్ బిల్డ్ వాయిస్ అసిస్టెంట్ తో లభించే ఈ స్మార్ట్ టీవీ హాండ్స్ ఫ్రీగా కూడా నియంత్రించవచ్చు.
Toshiba 32 ఇంచెస్ వి సీరీస్ HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ : ఈ స్మార్ట్ టీవీ వినియోగదారుల నుంచి 4.5 స్టార్ రేటింగ్ ను కూడా పొందింది. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. అంతేకాదు అనేక ఓటిటి ఫ్లాట్ ఫార్మ్లకు కూడా యాక్సిస్ చేయడానికి సులువుగా ఉంటుంది . ఇక ఈ టీవీతో మీ వినోదం రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లో క్వాడ్ ప్రాసెసర్ తో, 1GB ర్యామ్, 8GB మెమొరీను కూడా కలిగి ఉంటుంది. One Plus 32 ఇంచెస్ Y సీరీస్ HD రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ : ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచుల పరిమాణంలో లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ని మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయడం ద్వారా అనేక ఓటిటి ఫ్లాట్ ఫామ్లను యాక్సిస్ చేసుకోవచ్చు. ఇందులో ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లేక్స్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, ప్లే స్టోర్, క్రోమ్ కాస్ట్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ టీవీలో లభిస్తున్నాయి.