Zomato : మీరు జొమాటో ఎక్కువగా వాడతారా ? ఈ సారి ఆర్డర్ చేసే ముందు ఇది గుర్తు పెట్టుకోండి !

Zomato : ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జోమాటో వారు తమ కస్టమర్లకు నోరూరించే వార్తను చెప్పారు. తమ వినియోగదారులు ప్రస్తుతం భారతదేశంలోని అన్ని నగరాల నుంచి తీసుకు ఇష్టమైన వంటలను ఆర్డర్ చేసి తరువాత రోజే వాటిని డెలవరీ చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ నగరాల నుండి ఆర్డర్ చేసిన వంటకాలను మరుసటి రోజునే కస్టమర్లకు డెలవరీ చేయనుంది. అని చెప్పడం జరిగింది.ఈ విషయం గురించి జొమాటో ఫౌండర్, సీఈవో దీపించర్ గోయల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది.

దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఇష్టపడే వంటకాలను తమ కస్టమర్లకు టెస్ట్ చూపించనున్నట్టు తెలిపారు. ఇంటి వద్ద నుంచే ఐకానిక్ వంటకాలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు. భారతదేశంలోని ప్రతిమూల ఏదో ఒక అద్భుతమైన వంటకం ఉంటుంది. హైదరాద్ బిర్యాని, కోల్కత్తా రసగుల్లా, జైపూర్ కచోరీ, ల‌క్నో క‌బాబ్స్, ఢిల్లీ నుండి బటర్ చికెన్ లేక ప్యాజ్ వంటి వంటకాలను ఆర్డ‌ర్‌ చేసి, ఆ వంటకాలు తిని ఆస్వాదించవచ్చు. దేశంలోని ఏవైనా పాపులర్ వంటకాలను మీరు ఆర్డర్ చేసి వాటిని ఆస్వాదించవచ్చును.

Do you use Zomato a lot Keep this in mind before ordering
Do you use Zomato a lot Keep this in mind before ordering

అంతేకాదు రంగు, రుచి, వాసన, నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా బెస్ట్ ఫుడ్‌ అందిస్తామని చెప్పడం జరిగింది. మీరు ఆర్డర్ చేయడమే ఆలస్యం మరుసటి రోజు మీ ‘ముందుకు మీకు నచ్చిన ఫుడ్ మీముందుకు వచ్చి చేరుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఇప్పుడు జొమాటో యాప్ ద్వారా ఈ వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చునని ట్విట్ చేశారు. బిజినెస్-టు-బిజినెస్ నేరుగా ‘హైపర్ ప్యూర్’ విధానంలో సరఫరా చేయనున్నారని పేర్కొన్నారు. తన ఫుడ్ డెలవరీ వ్యాపారం కంటే ఇది చాలా పెద్దది కానున్నదని జొమాటో పేర్కొంది.ప్రస్తుతం, కొత్త ‘ఇంటర్ సిటీ లెజెండ్స్’ సేవను గుర్గావ్. దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసినటువంటి వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

Advertisement