మహిళలు కాళ్లకు పట్టీలు ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి..మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఆచారాలను పాటిస్తూ ఉన్నాము. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఇలాంటి ఆచారాలు అనేకం. అలాగే వీటిని మూఢనమ్మకాలు అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే హిందూ ఆచారాల వెనుక ఎంతో గొప్ప సైన్సు దాగి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వాటిలో మహిళల కాళ్ల పట్టీలు ధరించడం కూడా ఒకటి.సాధారణంగా కాళ్ళకు అలంకరణ కోసం చాలా మంది పట్టీలను వేసుకుంటారని భావిస్తారు. పట్టీలను ధరించడం వల్ల.. కాళ్ళకి అందంతో పాటు ఆరోగ్యకరంగా మేలు జరుగుతుందని శరీరానికి ఆచారాలు తెలుపుతున్నాయి.

Advertisement

అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.ఎక్కువ శాతం బాలికలు మహిళలు వెండి పట్టీలను ధరిస్తారు ఉంటారు. మరికొందరు బంగారు పట్టిలను కూడా ధరిస్తూ ఉంటారు. ఈ పట్టీలను ధరించడం వల్ల అవి కాళ్ళ మడమలను నిరంతరము తాకుతూనే ఉంటాయి. దీంతో వాళ్ల కాళ్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కాళ్ల పట్టీలు నిరంతరం కదులుతూ ఉండటం వల్ల.. వాటి నుంచి విడుదల అయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ని నింపుతాయట. దీంతో మనకు తెలియకుండానే మన శరీరం, మనసుకు ఆహ్లాదాన్ని నింపుతాయట. వీటి శబ్దం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కూడా బయటికి పంపుతాయి అని ఆచారాలు తెలియజేస్తున్నాయి.

Advertisement
Do you know why women wear bandages on their legs
Do you know why women wear bandages on their legs

వెండి, రాగి, బంగారం వంటి వాటిని అనేక రకాల ఔషధాలలో వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లోహాలు మన శరీరానికి మేలు చేస్తాయి కనుక ఇక ఈ లోహాలతో తయారు చేసిన పట్టిలను మనం ధరించినప్పుడు.. ఇక మన పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బాలికలు, పిల్లలు పట్టీలు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవతలకు ఆహ్వానం పలికినట్టు ఉంటుందని నమ్మకం. కొన్ని పురాణాల్లో తెలుపబడిన విధంగా ఆ ఇంటికి దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారని చెప్పబడింది. అందుచేతనే ప్రతి ఒక్కరు తమ పిల్లలకు, భార్య కు కాళ్లకు పట్టీలు ఉంచే విధంగా చూసుకోవాలి.

Advertisement