funeral : హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి మరణిస్తే అతడికి అంత్యక్రియలు నిర్వహించే టప్పుడు.. ఆ వ్యక్తికి సంబంధించిన వారసులు భుజం మీద కుండ నిండా నీటిని పెట్టుకొని.. ఆ శవం చుట్టూ మూడు లేదా ఐదు సార్లు తిరిగి చివరిలో వెను తిరగకుండా ఆ కుండను పగలగొడతారు. అయితే ఇలా ఎందుకు కుండను పగలగొడతారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇక ఇందులో దాగి ఉన్న మర్మం ఏమిటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం వాస్తవానికి ఆత్మ , శరీరం రెండు వేరు గా ఉంటాయి. పూర్వకాలంలో పౌష్టిక ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా జీవించేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా జీవించే కాలం కూడా తగ్గుతుంది అని చెప్పవచ్చు.
ఇక మనం చనిపోయినప్పుడు మన శరీరం నుండి ఆత్మ వేరు అవుతుంది. శరీరాన్ని దహనం చేసే వరకు ఆ ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాడే కట్టి ఆ శవాన్ని చితి వద్దకు మోసుకెళ్లే వరకు రాగులు , బొరుగులు వంటివి చల్లుతారు. ఇకపోతే శరీరాన్ని తగలబెట్టిన తరువాత కూడా.. ఆత్మ దేహం పొందాలని ప్రయత్నం చేస్తూ.. తిరిగి తన ఇంటికి వచ్చే ప్రయత్నం లో శవం మీద పోసిన రాగులు, బొరుగులు ఏరుకొని రావాల్సి ఉంటుంది.అది కూడా సూర్యోదయం అయ్యే లోపు.. అలా చేసినప్పుడే తమ వారిని చూడడానికి అనుమతి దొరుకుతుంది అని మన సంప్రదాయాలు చెబుతున్నాయి.

ఇక పోతే ఆ శరీరాన్ని చితి మీద పెట్టి.. కుండలో నీటిని తీసుకుని ఆ కుండకు రంధ్రాలు చేస్తూ శవం చుట్టూ మూడుసార్లు తిరుగుతారు. ఎందుకంటే కుండ శరీరం లాంటిది.. అందులోని నీరు ఆత్మ లాంటిది. కుండ నుంచి నీరు ఎలాగైతే బయటికి వెళ్లిపోతుందో అలాగే శరీరం నుంచి కూడా నీ ఆత్మ అలాగే వెళ్లిపోవాలి అని దాని వెనుక అర్థం. కుండను కింద పడేసి పగలగొట్టి శరీరానికి నిప్పు పెట్టేస్తాము. ఇక నీకు ఈ శరీరం ఉండదు ఇక్కడినుంచి నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనం ఇచ్చే సంకేతం. ఇక మన సాంప్రదాయం ప్రకారం ప్రతి చిన్న విషయం వెనుక ఎంతో అర్థం దాగి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి.