SIM Card : సాధారణంగా మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్ లేదా ఫీచర్ ఫోన్ ఏదైనా కావచ్చు. నేటి కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అనేది కచ్చితంగా ఉంటుంది.. ఫోన్ ఉపయోగించేవారు లేదా ఉపయోగించని వారు కూడా ఇప్పుడు చెప్పబోయే విషయం తప్పకుండా తెలుసుకోవాలి.. SIM లేని ఏ ఫోన్ అయినా కేవలం ఒక పెట్టె మాత్రమే.. కానీ సిమ్ ని సంవత్సరాల తర్వాత ఉపయోగించిన వినియోగదారులకు దాని గురించి ప్రత్యేకంగా తెలియదు. ఇక ఇప్పటివరకు మనం చూసిన అన్ని సిమ్ కార్డులలో ఒక ఉమ్మడి విషయం ఉంది ఇది మనమందరం గమనించాలి.
అదేమిటంటే ప్రతి సిమ్ ఒక మూల కొద్దిగా కట్ చేయబడినట్లు ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నట్లయితే మొబైల్ ఫోన్లో సరైన స్థలంలో ఉంచడానికి సిమ్ లోనే ఒక మూల కత్తిరించబడిందని అందరూ అనుకుంటూ ఉంటారు.. ఇక తలకిందులుగా లేదా నేరుగా ఉందా అని గుర్తించడానికి ఇలా తయారు చేయబడింది. వ్యక్తులు తలకిందులుగా పెడితే దాని చిప్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా ఒక కార్నర్ లో కట్ చేసి దానిని సరైన విధంగా పెట్టేలాగా అక్కడ అమరికను కూడా అలాగే చేసి ఉంచుతారు. అందుకే సిమ్ కార్నర్ లో కట్ చేసినట్టు మనం చూడవచ్చు. SIM మీనింగ్ ఏమిటంటే సబ్ స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్..
ఈ కార్డు ఇంటర్నేషనల్ మొబైల్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్ మరియు దాని అనుసంధాణానికి సురక్షితమైన పద్ధతిలో నిలువ చేసే ఆపరేటింగ్ సిస్టం ను అమలు చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇక మొబైల్ ఫోన్లో ఉపయోగించి సిమ్ కార్డ్ వెడల్పు 25mm, పొడవు 15mm, మందం 0.76 mm.. ఇక ఏ క్రమంలోనే కార్డుల్లో సైజుల్లో మార్పులు కూడా వచ్చాయి. నానోసిన్ పేరుతో సిమ్ కార్డుల సైజు మరింత తగ్గిపోయింది . అయితే సిమ్ డిజైన్ లో కీలకమైన కట్ ఆఫ్ కార్నర్ మాత్రం అలాగే కొనసాగుతోంది. వినియోగదారులు అలవాటు పడిపోయిన పద్ధతిని మార్చడానికి కంపెనీలు కూడా సుముఖంగా లేవు.. ఇక సిమ్ మొబైల్ కు ఎంత ప్రత్యేకమైన పరికరము అర్థం చేసుకోవచ్చు . సిమ్ కార్డు లేని మొబైలు ఎందుకూ పనికిరాదని కూడా గుర్తుంచుకోవాలి.