Tulasi Plant : ఏ తులసి ఆరోగ్యానికి మంచిదో తెలుసా..? తులసి.. తులసి ఒక అద్భుతమైన ఔషధాలు కలిగిన పవిత్రమైన మొక్క..అలాంటిది తులసిలో కూడా మంచిది , చెడ్డది ఉంటుందా? అని మీరు సందేహపడవచ్చు. కానీ తులసిలో కూడా మనకు ఎన్నో రకాల తులసిలు కనిపిస్తాయి. అందులో కొన్ని రకాల తులసిలు మాత్రమే ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అనేక వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి తులసిలో ప్రస్తుతం రామ తులసి , కృష్ణ తులసి బాగా ప్రావీణ్యం పొందిన మొక్కలు.. ఈ రెండింటిలో ఆరోగ్యాన్ని పెంచే ఏ తులసి అంతటి అధికారం ప్రాముఖ్యతను సంతరించుకుందో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
ప్రస్తుతం హిందూ సంప్రదాయం ప్రకారం క్రీస్తుపూర్వం నుంచి దేవతామూర్తులు సైతం ఎక్కువగా తులసిని పూజిస్తున్నారు. ఇక అదే ఆనవాయితీ నేటికీ కూడా కొనసాగుతూ వస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో తులసిని ఆరోగ్యపరంగా కూడా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రామ తులసిని పూజ కొరకు అలాగే ఔషధ గుణాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ తులసి ఆకులు ఇతర తులసి ఆకుల కంటే తీయటి రుచిని కలిగి ఉంటాయి. ఇక కృష్ణ తులసి విషయానికి వస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగును కలిగి ఉంటాయి ఇక ఊదా రంగు కాండం కలిగి ఉండి.. కొంచెం చేదు రుచిని అందిస్తాయి.
ఇక రెండు రకాల తులసి మొక్కలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇకపోతే రామ తులసి తినడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుంచి ఉపశమనం కొరకు రామ తులసిని తీసుకోవచ్చు. ఇక క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా రామ తులసి కలిగి ఉంటుంది. ఇకపోతే కృష్ణ తులసి శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను నయం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇందులో ఉండే గుణాలు మధుమేహా రోగులకు మంచి ఔషధం.. ఇకపోతే చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేసి జుట్టును ఒత్తుగా పొడవుగా పెరగడానికి కృష్ణ తులసి సహాయపడుతుంది .
కాబట్టి రెండు తులసిలు కూడా మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇక మీకు అందుబాటులో ఉండే తులసిని ప్రతిరోజు మూడు ఆకులు చొప్పున ఉదయాన్నే నమిలి మింగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.