Hair Tips : జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే ఏం చేయాలో తెలుసా..?

Hair Tips  : సాధారణంగా చాలామంది జుట్టుకు నూనె పెట్టడం అంటే అమ్మో అని అంటూ ఉంటారు.. కానీ జట్టుకు ఎప్పుడైతే నూనెను పెట్టడం మానేస్తామో.. అప్పుడు పొడిబారిపోయి జుట్టు నిర్జీవంగా మారి కళ తప్పుతుంది. అందుకే నూనె ను సరైన మోతాదులో జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.. జుట్టుకు నూనె పెట్టడంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు ఊడిపోయే ప్రమాదం కూడా ఎక్కువ అని గ్రహించాలి. ఇక సాధారణంగా జుట్టు కుదుళ్ల లో సహజ నూనెలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక వారానికి ఒకటి లేదా రెండు సార్లు మనం కూడా జుట్టుకు నూనె ను అప్లై చేయడం వల్ల జుట్టు మరింత కోమలంగా.. మృదువుగా మారుతుంది.

ఇకపోతే ఏ ఏ నూనెలు ఉపయోగించాలి అనే విషయానికి వస్తే. ఇక చమురు , కొబ్బరి నూనె, విటమిన్ ఈ క్యాప్సిల్స్ వంటివి ఉపయోగించవచ్చు. ముందుగా ఒక గిన్నెలో చమురు వేసి స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా చేయాలి. ఇప్పుడు అందులో కొద్దిగా విటమిన్ ఈ క్యాప్సిల్ తో పాటు కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్లు కలపాల్సి ఉంటుంది.. ఇక మూడు బాగా మిక్స్ అయ్యే వరకు రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద అలాగే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మునివేళ్లతో జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి అన్ని కణాలు ఉత్తేజితమవుతాయి.

Do you know what it means to have thick hair
Do you know what it means to have thick hair

ఎప్పుడైతే తలకు నూనె బాగా మసాజ్ చేస్తామో.. తలనొప్పి , నిద్రలేమి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక ఈ చిట్కా రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.. ఇక ఉదయాన్నే గోరు వెచ్చని లేదా చల్లని నీటితో.. తక్కువ గాఢత కలిగిన షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి.. ఇందులో ఉండే విటమిన్ ఈ క్యాప్సిల్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అలాగే చమురు, కొబ్బరి నూనె జుట్టు కోమలం గా మారడానికి సహాయం చేస్తాయి.