సాధారణంగా అందానికి ఆడవారు ఇచ్చిన ప్రాధాన్యత మగవారు ఇవ్వరు. కానీ ఆడవారి చర్మ తత్వం కన్నా మగ వారి చర్మ తత్వం మందంగా, కఠినంగా ఉంటుంది. వీరు బయట తిరిగినప్పుడు చర్మం ఎక్కువగా పొల్యూషన్ కి గురి అయి అనేక సమస్యలను తెచ్చి పెడుతూ ఉంటుంది. కానీ ఈమధ్య మగవారు కూడా అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారికి సి-విటమిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజానికి సి విటమిన్ చర్మం యొక్క కొల్లాజెన్ ను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ వల్ల పొల్యూషన్ కారణంగా పాడయ్యే చర్మాన్ని రిపేరు చేస్తుంది.
విటమిన్ సి యొక్క ప్రయోజనాలు:
విటమిన్ సి అనేది మగవారికి మరియు స్త్రీ లకు ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన ఒక ముఖ్యమైన న్యూట్రిన్యంట్. విటమిన్ సి యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఫోటోప్రొటెక్షన్. సూర్యుని యొక్క కఠినమైన కిరణాల వల్ల కలిగే నష్టం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.దీనిని తరుచుగా వాడటం వల్ల మృదువుగా ఉండే చర్మాన్ని పొందవచ్చు.
ముఖంపై వచ్చే మచ్చలు లేదా చర్మం రంగులో మార్పులకు, వృద్యాప్యం కు అనేక కారణాలు ఉన్నాయి.కానీ ఎక్కువగా విటమిన్ సి ఈ మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువగా విటమిన్ సి ఉండేలా చూసుకుంటే శరీర ఆరోగ్యానికే కాక చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
చర్మంపై గీతలు.. వృద్ధాప్యం ఫలితంగా వస్తుంటాయి. అలాంటి వారు విటమిన్ సి సీరమ్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ ముడతలు మరియు స్కిన్ స్కార్స్ రాకుండా రిపేర్ చేస్తుంది.
చర్మం రకం లేదా ఆకృతితో సంబంధం లేకుండా, పురుషులు మరియు స్త్రీలకు సన్‌స్క్రీన్ తప్పనిసరి. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.జిడ్డు చర్మం కలవారైతే మీరు సన్‌స్క్రీన్‌తో పాటు విటమిన్ సి సీరమ్‌ను మిక్స్ చేస్తే, జిడ్డు సమస్య కంట్రోల్ అవుతుంది.
మీరు విటమిన్ సి సీరమ్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, పురుషుల ముఖము పై వచ్చే మచ్చల సమస్యను తగ్గించుకోవచ్చు.అంతేకాకుండా, విటమిన్ సి సీరం ముడతలు తగ్గించడానికి,కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.ఇది చర్మం యొక్క వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది మరియు అందమైన చర్మాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది.
ఫేస్ వాష్
ఫేస్ వాష్‌ల నుండి ఫేస్ మాస్క్‌లు మరియు క్రీమ్‌ల వరకు ప్రతి బ్యూటీ ప్రొడక్ట్‌లో విటమిన్ సి ఎక్కువగా వున్న వాటిని ఎంచుకోవాలి. ఇలాంటి ప్రోడక్ట్ వల్ల మగవారి ముఖము అందంగా, తాజాగా తయారవుతుంది.