Cerebral Palsy : సెరిబ్రల్ పాల్సీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

సెరిబ్రల్ పాల్సీ అనగానే మనకు ముందుగా ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తనయుడు జైన్ నాదెళ్ల గుర్తుకువస్తారు. ఈ అబ్బాయి పుట్టుకతోనే ఈ సమస్యతో జన్మించి.. మొన్నటికి మొన్న 26 సంవత్సరాల వయసులో ఈ వ్యాధి తీవ్రతరం కావడంతో మరణించిన విషయం తెలిసిందే. సెరిబ్రల్ పాల్సీ అనేది చిన్నారులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ అరుదైన వ్యాధి బారినపడే అవకాశాలు వుంటాయి. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ వ్యాధి గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేదు అని చెప్పవచ్చు. సత్య నాదెళ్ల కు అంత డబ్బు ఉండి కూడా వ్యాధిని నయం చేయలేక పోయారు అంటే ఇక ఈ వ్యాధి ఎంత తీవ్రతరమైనదో అర్ధం చేసుకోవచ్చు.

ఇకపోతే సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి తల్లి గర్భం లో బిడ్డ ఎదుగుతున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతే.. అప్పుడు ఆ బిడ్డ ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇక ఈ క్రమంలోనే బిడ్డకు ఎదురయ్యే తీవ్రమైన అనారోగ్య సమస్యలను మనం సెరిబ్రల్ పాల్సీ అని అంటారు.సెరిబ్రల్ పాల్సీ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి స్పాటిక్ సెరిబ్రల్ పాలసీ.. రెండవది ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ.. మూడవది ఎటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ.స్పాటిక్ సెరిబ్రల్ పాల్సీ వచ్చినప్పుడు చిన్నారులలో రక్తం సరఫరా అవయవాలకు ఆగిపోతుంది.. ముఖ్యంగా కాళ్లు , చేతులు బిగుసుకుపోయి వాటి కదలికలు కష్టమవుతుంది. ఇక ఎథిటాయిడ్ సెరిబ్రల్ పాల్సీ వచ్చినప్పుడు పిల్లల ప్రమేయం లేకుండానే శరీరంలో అవయవాలు కదలడం మొదలవుతాయి.

Do you know these things about cerebral palsy
Do you know these things about cerebral palsy

ఇక ఏటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ సోకిన వారికి గ్రహణ శక్తి తగ్గిపోతుంది.. పిల్లల ఎదుగుదల కూడా తప్పుతుంది. కానీ ఈ సమస్యలలో కేవలం ఏదైనా ఒకటి మాత్రమే పిల్లలకు సోకే అవకాశం ఉంటుంది.ఇకపోతే ఫిజియోథెరపీ వంటి వాటితో కాస్త ఉపశమనం కలిగించవచ్చు తప్ప శాశ్వతంగా సమస్యలను నయం చేయవచ్చు అని.. ఎక్కడ, ఎవరు కూడా అభివర్ణించడం లేదు.. కానీ చిన్నారుల తల్లిదండ్రులు ఈ సమస్యలపై అవగాహన పెంచుకొని అందుకు అనుకూలంగా ఇంట్లో వాతావరణాన్ని కల్పించడం వల్ల పిల్లలలో కొంతవరకు ఈ సమస్యలను అధిగమించవచ్చు.