Hidden Cameras : ప్రస్తుత కాలంలో రోజురోజుకీ ఆక్రమణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు తెలియకుండానే రహస్యంగా ఫోటోలు తీసి, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడుతూ నానా రచ్చ చేస్తూ ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేస్తున్నారు. కొంతమంది కేటుగాళ్లు ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్ వంటి మనకు తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామంది హెచ్చరిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో చాలా మంది హోటల్స్, రెస్టారెంట్ కి మాత్రమే కాకుండా ఏదైనా మాల్స్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏదైనా నచ్చిన డ్రెస్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కచ్చితంగా ట్రయల్ వేస్తారు. ఇక అలాంటి ట్రైల్స్ రూమ్ లో.. బెడ్ రూమ్ , బాత్ రూమ్ వంటి ప్రైవేట్ ప్లేస్ లో రహస్య కెమెరా లను అమర్చినట్లు.. మీకు అనుమానం వస్తే వాటిని గుర్తించడానికి ఈ టిప్స్ ఫాలో చేయండి.
1. ఫిజికల్ సర్చింగ్ : కొన్ని ప్రాంతాలలో ఏదైనా గదిలో మీరు ఉండాల్సి వస్తే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇక బాత్రూంలో, బెడ్ రూమ్లో వంటి ప్రాంతాలలో కెమెరాలు ఎక్కడైనా అమర్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్ని మూలలా నాలుగు గోడల చుట్టూ అలాగే పైన రూఫ్ మీకు ఎక్కడ అనుమానం వచ్చినా సరే ముందుగా మీరు వెతకాల్సి ఉంటుంది. అంతేకాదు ఏదైనా గాడ్జెట్ ఉండాల్సిన స్థలంలో అది కనిపించకపోతే కూడా దాన్ని మీరు చెక్ చేయాలి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ అవుట్ లెట్ , థర్మోస్టార్ట్ , స్మోక్ డిటెక్టర్, టిష్యూ బాక్స్, వాల్ సాకెట్స్, డెస్క్ పాయింట్స్, వాల్ పేపర్లు కూడా వదలకుండా ఫిజికల్గా సెర్చ్ చేయాలి.
2. మొబైల్ ఫోన్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది .కాబట్టి దీని ద్వారా మీరు రహస్య కెమెరాలు గుర్తించవచ్చు. అది ఎలాగంటే ముందుగా రూమ్ లో ఉన్న అన్ని లైట్లు ఆఫ్ చేసి.. మీ ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. ఇక కెమెరా లెన్స్ అతి చిన్నవిగా ఉన్నా కూడా అవి లైట్ ను రిఫ్లెక్ట్ చేస్తాయి . కాబట్టి ఎక్కడైనా స్పై కెమెరా ఉంటే అక్కడి నుంచి మీ ఫోన్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక మరొక మార్గం ఏమిటంటే మీ ఫోన్ కెమెరాను ఆన్ చేసి రూమ్ లోని లైట్లు అన్నీ ఆపేయాలి. ఇక స్మార్ట్ ఫోన్ కెమెరాలు ఇన్ఫరారిడ్లైట్ గుర్తించగలవు. ఇలా కూడా మీరు రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఏదైనా మీకు అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే దాన్ని అన్ ప్లగ్ చేసి టవల్తో మూసివేయండి. ఇక అంతే కాదు అక్కడి నుంచి తీసివేసి ఎక్కడైనా దాచినా కూడా సరిపోతుంది.