Twitter Video Download : సాధారణంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా చాలామంది సోషల్ మీడియా లో షేర్ చేసి అందరితో తమ ఆనందాన్ని అలాగే ఏ విషయాన్ని అయినా పంచుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు నచ్చిన ఏదైనా వీడియోను దాచుకోవాలి అంటే మాత్రం అది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఫేస్బుక్, ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ వంటి వాటిల్లో వచ్చే వీడియోలను డౌన్లోడ్ చేయడం సాధ్యపడదు. అలాంటప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియక నచ్చిన వీడియోలను దాచుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ట్విట్టర్ ద్వారా మీరు వైరల్ అయ్యే వీడియోలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో ట్విట్టర్ వీడియోలను ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ ను ఓపెన్ చేయాలి.
ఇప్పుడు Tweet2gif యాప్ కోసం సెర్చ్ చేసి దాన్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయండి.
ఇక ఇప్పుడు ట్విట్టర్ ను ఓపెన్ చేసి మీకు నచ్చిన అలాగే డౌన్లోడ్ చేయాలనుకుంటున్న వీడియో కోసం చూడండి.
ఇప్పుడు షేర్ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో లింకును అక్కడినుండి కాపీ చేసుకోవాలి.
ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న Tweet2gif ఆప్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ విభాగంలో లింకును పేస్ట్ చేయాలి.
ఇక మీరు దీన్ని సాధారణ వీడియో డౌన్లోడ్ చేయాలనుకుంటే..DownloadMP4 పై క్లిక్ చేయండి లేదా లూప్ లో ఉన్న సౌండ్ లేని వీడియో గా కావాలి అనుకుంటే download Gif క్లిక్ చేయండి.
ఇక అంతే ఈ వీడియో మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క గ్యాలరీ లేదా ఫోటోలు యాప్ లో సేవ్ చేయబడుతుంది.
అదే ఒకవేళ ఐఫోన్ లో ట్విట్టర్ వీడియోలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
IOS కోసం మీ ఐఫోన్ హోమ్ స్క్రీన్ లో వెబ్ లింక్ ను సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా హీటర్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక మీ ఫోన్లో Safari బ్రౌజర్ ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు Twittervideodownloader.com అని టైప్ చేసి దిగువన ఉన్న షేర్ చిహ్నంపై క్లిక్ చేయాలి.
క్రిందికి స్క్రోల్ చేసి హోమ్ స్క్రీన్ కి జోడించు అనే ఎంపిక మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక ట్విట్టర్ నుండి వీడియోను డౌన్లోడ్ చేయడానికి వీడియో లింకును కాపీ చేసి..Twittervideodownloader.com అనే లింక్ లోకి వెళ్లి.. వీడియో లింక్ ని డౌన్లోడ్ విభాగంలో పేస్ట్ చేసి డౌన్లోడ్ పై నొక్కండి.
ఇక అలాగే కొద్దిసేపు డౌన్లోడ్ వీడియో బటన్ నొక్కి పట్టుకుంటే పాపపు వచ్చినప్పుడు డౌన్లోడ్ లింక్డ్ ఫైల్ పై మరొకసారి నొక్కాలి.
ఇక కింద ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసిన వీడియోను ఓపెన్ చేయాలి.
ఇక షేర్ బటన్ పై నొక్కి.. చివరిగా సేవ్ వీడియో పై నొక్కాలి.
ఇలా డౌన్లోడ్ అయిన వీడియో మీ ఐఫోన్ ఫొటోస్ యాప్ లో లభిస్తుంది.