Smart Phone Battery : సాధారణంగా మనం తరచూ వినే మాట ఏమిటంటే స్మార్ట్ ఫోన్ గేమ్ ఆడేటప్పుడు పేలిపోయిందని లేదా రాత్రి పూట చార్జింగ్ అలాగా పెట్టి వదిలేయడం వల్ల ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ మొబైల్ బ్యాటరీ బ్లాస్ట్ అవ్వకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యమైన అంశం రాత్రి సమయంలో ఫోన్ వినియోగించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ కు ఛార్జింగ్ పెట్టకూడదు. ఎందుకంటే అది మీ మొబైల్ బ్యాటరీని పాడు చేయడమే కాకుండా డివైస్ వేడెక్కి ఫోన్ యొక్క బ్యాటరీ ఎప్పుడైనా సరే పాడయ్యే అవకాశం ఉంటుంది . అది మీకు ప్రాణాపాయస్థితికి తీసుకురావచ్చు . కాబట్టి రాత్రిపూట ఫోన్ వినియోగించేటప్పుడు అస్సలు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టకూడదు.
ఇక అంతేకాదు మీరు మీ స్మార్ట్ ఫోన్ కి .. కంపెనీ ఏదైతే చార్జర్ ఇచ్చిందో.. ఆ చార్జర్ మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే మీకు ఫోన్ చార్జ్ కోసం కంపెనీ నుంచి అందించే చార్జర్ ని ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది . ఇది కాకుండా లోకర్ చార్జర్లను మీరు ఉపయోగించడం వల్ల మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ చెడిపోయే అవకాశం ఉంటుంది. స్థానిక చార్జర్లను వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దానికి లోకల్ చార్జర్లు క్వాలిటీ తక్కువగా ఉంటాయి తద్వారా బ్యాటరీ కి ఉపయోగించడం వల్ల మొబైల్ బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ స్మార్ట్ మొబైల్ కి ఇచ్చిన చార్జర్ ను ఇతర స్మార్ట్ ఫోన్ ల బ్యాటరీలను చార్జ్ చేయడానికి అసలు వినియోగించకూడదు.
ఇది చార్జర్ ను పూర్తిగా పాడు చేస్తుంది. అంతేకాదు పాడైపోయిన తర్వాత స్మార్ట్ ఫోన్ బ్యాటరీని కూడా పాడు చేయడం మొదలుపెడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీ సొంత స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కంపెనీ చార్జర్లు మాత్రమే ఉపయోగించాలి. అది కూడా స్మార్ట్ ఫోన్ కి అందించిన చార్జర్ ని మాత్రమే ఉపయోగించడం తప్పనిసరి. ఇక మీ స్మార్ట్ ఫోన్ కి ఇచ్చిన చార్జర్ ఇతరులకు ఇవ్వకూడదు. ఇక స్మార్ట్ ఫోన్ ని కూడా పదే పదే ఛార్జ్ చేయకూడదు. 20% కంటే తక్కువ ఛార్జ్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఛార్జ్ పెట్టాలి. లేదంటే పదేపదే చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పై ఒత్తిడి పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా హీట్ ఎక్కే వరకు ఉపయోగించకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బ్లాక్ అయ్యి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.