Jio Plans : సాధారణంగా కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామంది ఇంటికే పరిమితం అవుతూ వర్క్ ఫ్రం హోం పేరిట ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వాళ్ళు ఎక్కువగా ల్యాప్ టాప్, సెల్ఫోన్ లాంటివి ఉపయోగిస్తున్న నేపథ్యంలో డేటా కూడా అధిక వినియోగం ఉంటుంది. ఎక్కువ స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్, OTT వీడియో కంటెంట్ చూసే వారికి మొబైల్ హాట్ స్పాట్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ప్రతిరోజు ఎక్కువ డేటా కావాలి. అందుకే రిలయన్స్ జియో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎక్కువగా డేటా కావాలనుకునేవారు అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా పొందాలనుకునే వారి కోసం నాలుగు అద్భుతమైన ప్లాన్లను తీసుకురావడం జరిగింది. మరి ఆ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
రూ.419 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే ప్రతిరోజు 3GB డేటాను పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు ఏ నెట్వర్క్ కి అయినా సరే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందుతారు. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో యాప్ లకు సంబంధించి అన్ని యాప్ లను మీరు ఉచిత సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది.
రూ.601 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది. అయితే ఇందులో మరొక బెనిఫిట్ ఏమిటంటే ప్రతిరోజు 3GB డేటా అందించడమే కాకుండా అదనంగా 6గ్బే డేటా ఓచర్ కూడా దక్కుతుంది. ఇక ఏ నెట్వర్క్ కి అయినా సరే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. అలాగే అన్ని జియో యాప్లకు ఉచిత సబ్స్క్రిప్షన్ ఉంటుంది.
రూ.1, 199 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక ప్రతిరోజు 3GB డేటాతో పాటు మూడు నెలల ఉచిత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఇక అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను అలాగే అన్ని జియో యాప్ లను ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు.