iPhone 13 : ఈ మధ్యకాలంలో చాలామంది యాపిల్ సంస్థ ప్రవేశపెట్టిన ఐఫోన్లను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. కానీ ధరలు ఎక్కువగా ఉందనే నేపద్యంలో వాటిని కొనుగోలు చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్న నేపథ్యంలో తాజాగా యాపిల్ సంస్థ కొత్తగా ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ సెప్టెంబర్ 7వ తేదీ అంటే నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ముఖ్యంగా.. యాపిల్ ఐఫోన్ 14 , ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్ మోడల్స్ పరిచయం చేయబోతోంది యాపిల్. ఇదిలా ఉండగా ఐఫోన్ 14 మోడల్స్ విడుదలవుతున్న నేపథ్యంలో ఐఫోన్ 13 మోడల్ కు కూడా ఫ్లిప్కార్ట్ సైట్లో ఏకంగా 12 శాతం తగ్గింపు ప్రకటించింది.
ఇక 128GB స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 13 మోడల్ ధర ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో రూ.69, 999 గా విక్రయించబడుతోంది. ఇక 256GB వేరియంట్ ధర రూ.79,999 విక్రయించబడుతున్న నేపథ్యంలో భారీ ధరల తగ్గింపుతో ఐఫోన్ 13 మోడల్ ను మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ తో కూడా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకుంటే వినియోగదారులకు రూ.19,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినట్లయితే రూ.2000 క్యాష్ బ్యాక్, అలాగే ఐదు శాతం డిస్కౌంట్ తో పాటు రూ. 1000 క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లన్నీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉండడం గమనార్హం.
మొత్తంగా ఈ ఆఫర్స్ అన్నీ మీకు రూ. 30 వేల వరకు తగ్గింపును అందిస్తాయి. ఇక ఐఫోన్ 13 ఫీచర్స్ విషయానికి వస్తే 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డి ఆర్ డిస్ప్లే తో, A15 బయోనిక్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది కెమెరా 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడుతుంది. ముఖ్యంగా కొత్త ఐఫోన్ల ధర మునుపటి మోడల్ కంటే 50 డాలర్ల వరకు తక్కువగా ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇక దీని ప్రకారం చూసుకుంటే ఐఫోన్ 14 మోడల్ ధర 750 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుందని యాపిల్ సంస్థ తెలిపే ప్రయత్నం చేసింది. ఇకపోతే లాంచ్ చేస్తోంది కాబట్టి త్వరలోనే అమ్మకానికి కూడా పెట్టబోతుందని సమాచారం.