Smart Phones : ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు రావడం జరిగింది. ఇక తన ప్లాట్ఫారంలో తాజాగా స్మార్ట్ ఫోన్ అప్గ్రేడ్ డేస్ సేల్ ప్రారంభించడం గమనార్హం.. ఇకపోతే గ్రేట్ ఫ్రీడమ్ సేల్ తర్వాత కస్టమర్లు ఈ సెల్ లో భారీ డిస్కౌంట్ లో ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక సేల్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సేల్ ద్వారా ఏకంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది అని అమెజాన్ వెల్లడించింది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. ఇక ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సేల్ లో ఆర్బిఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు పై 10% తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. మరి ఎలాంటి మొబైల్స్ పై ఆఫర్ లభిస్తుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
Smart Phones : iQOO 9T స్మార్ట్ ఫోన్
ఈ స్మార్ట్ ఫోన్ పై కస్టమర్లు సుమారుగా రూ.10,000 వరకు తగ్గింపును పొందుతారు. ఇక ఈ ఫోన్ సేల్ లో భాగంగా రూ.49,999 కి లభిస్తుంది. ఇక ఇందులో రూ.4 వేల బ్యాంకు డిస్కౌంట్ కూడా వుంటుంది. iQOO 9T స్మార్ట్ ఫోన్ 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ అలాగే 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ ఆప్షన్లతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
iQOO Neo 6 5G: ఈ స్మార్ట్ ఫోన్ రూ.29,999 కే సేల్ అందుబాటులో వుంది.. రూ.3,000 బ్యాంకు డిస్కౌంట్ కూడా ఉంది. ఇందులో 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అలాగే 2 MP కెమెరా లు ఉన్నాయి.
IQOO Z6 5G: ఈ స్మార్ట్ ఫోన్ మీకు 14, 999 రూపాయలకు అందుబాటులో ఉంది.
IQOO Z6 5G ప్రో: ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీకు రూ.23,999కే అందుబాటులో ఉంది. అంతేకాదు 6GB ర్యామ్ +128 GB స్టోరేజ్..8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ అలాగే 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది.
ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ లపై మంచి ఆఫర్లు ఉండడం గమనార్హం.