అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎమ్ఎస్ ధోని రిటైర్ అయినా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ధోనికి ఇదే చివరి సీజన్ అనే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ తర్వాత ధోని చెపాక్ స్టేడియం అంతా తిరిగాడు. అభిమానులకు అభివాదం చేశాడు. దీంతో మరోసారి ధోని రిటైర్మెంట్‌పై అందరికీ సందేహాలు వచ్చాయి. ఈ తరుణంలో సీఎస్‌కే అభిమానులకు ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ గుడ్ న్యూస్ అందించారు.
ధోని వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడొచ్చన్నారు. దీంతో సీఎస్‌కే అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ను వచ్చే ఐపీఎల్‌లోనూ చూడొచ్చనే ఆశలు వారిలో పెరిగాయి. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై 13 మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికలో మాత్రం రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లడం ఖాయమనే అనిపిస్తోంది.