Critics choice award: ఉత్తమ నటుడిగా రామ్ చరణ్.. ఫ్యాన్స్ దిల్ ఖుషీ..!

Critics choice award: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ దర్శక నిర్మాతలను కూడా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ఇద్దరూ కూడా లీనమైపోయి మరీ నటించారు.. మరీ ముఖ్యంగా సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించిన తీరుకు ప్రేక్షకులే కాదు లెజెండ్రీ హాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా రామ్ చరణ్ ఈ పాత్రలో నటించడం గురించి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరూన్ కూడా ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించడం తెలిసిందే.

RRR Star Ram Charan Gets Praises From Hollywood Director-Writer: 'Would  Love To Write a Movie For Him'

ఇకపోతే తాజాగా రామ్ చరణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డులలో బెస్ట్ యాక్షన్ మూవీ క్యాటగిరీలో ఉత్తమ నటుడు గా రామ్ చరణ్ కు నామినేషన్ లభించింది.. అమెరికాలోని క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ గత రెండేళ్లుగా” ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్” పేరిట అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ఇస్తుంది. మార్చి 16వ తేదీన విజేతలను ప్రకటించనున్నారు. మరి ఇందులో రామ్ చరణ్ అవార్డు సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.