Flash news: ఢీ మాస్టర్ చైతన్య చావుకి వాళ్లే కారణం- కండక్టర్ ఝాన్సీ సీరియస్ ఆరోపణలు..

బుల్లితెరలో ప్రసారమయ్యే పాపులర్ డాన్స్ షో ద్వారా ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ పాపులర్ అయ్యాడు. అయితే ఈ డ్యాన్స్‌ మాస్టర్ తాజాగా సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఏప్రిల్ 30న నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు చైతన్య మాస్టర్. ఈ మరణంతో దిగ్భ్రాంతికి గురైన స్నేహితులు, తెలిసిన వారు అతనితో తమకున్న అనుబంధం గురించి చెబుతున్నారు. మరికొందరు అతను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై ఫేమస్ అయిన కండక్టర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement

చైతన్య మాస్టర్ చనిపోవడానికి కొందరు ఈవెంట్ ఆర్గనైజర్లు, ఆర్టిస్టులే కారణం అని ఆమె సెన్సేషనల్ ఆరోపణలు చేసింది. చైతన్య మాస్టర్‌ది మంచి మనసు అని, తోటి ఆర్టిస్టులకు సహాయం చేయాలని గుణంతో ఆయన అన్ని ఈవెంట్లకు వారిని పిలుస్తుంటారని ఝాన్సీ చెప్పుకొచ్చింది. అయితే డిసెంబర్ 31న జరిగిన ఒక ఈవెంట్‌కి కొందరు ఆర్టిస్టులు రాకుండా హ్యాండ్ ఇచ్చారని దీనివల్ల ఈవెంట్ ఆర్గనైజర్లు మాస్టర్‌కి రావలసిన రూ.7లక్షలు ఆపేసారని తెలిపింది. ఇంకా ఇలాంటి ఎన్నో సందర్భాలలో చైతన్య ఎంతో డబ్బును కోల్పోయాడని, చివరికి అప్పుల పాలయ్యాడని ఆరోపణలు చేసింది. ఎవరు డబ్బులు ఆపేసినా ఆర్టిస్టులకి అప్పులు చేసి మరీ మాస్టర్ చైతన్య డబ్బులు ఇచ్చేవాడని, చివరికి ఈ అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె వ్యాఖ్యలు చేసింది.

Advertisement