CM Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుమానం నిజమేనా.!? ప్రూఫ్ ఇదిగో..!

CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లు కావస్తోంది. వచ్చే ఎలక్షన్లలో కూడా అధికారం తనదే కావాలని ప్లాన్ చేస్తున్నారు.. కానీ ఏపీలో వైసిపి గ్రాఫ్ మాత్రం మెల్లమెల్లగా పడిపోతుంది.. అందుకు గల కారణాలు ఏంటి అనేది జగన్ కి తెలిసాయని అంటున్నారు.. 6 నెలల కాలంలోనే చాలా విషయాలు చోటు చేసుకున్నాయని.. అందుకే గడప గడప కార్యక్రమం డిజైన్ చేయడం వెనుక జగన్ ఆలోచన ఉందని.. ఆ కార్యక్రమంతో వైసిపి గ్రాఫ్ పెంచాలని అనుకున్నారట.. కానీ.. గడపగడప కార్యక్రమాన్ని ఒక మొక్కుబడి తంతుగా అందరూ మార్చేశారు. మొదట్లో కాస్త సీరియస్ గా ఈ ప్రోగ్రాంలు తీసుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గడపగడప కు వెళ్లి పలకరించి వారిని పరామర్శించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట..

కానీ మెల్లమెల్లగా దాన్ని పట్టించుకోవడం మార్చేసినట్లు నివేదికలు వస్తున్నాయట. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు కూడా జస్ట్ అలా ఏదో దేనికో అన్నట్టుగా ఉంటున్నాయి. కానీ సీరియస్ డిస్కషన్ కానీ ఎఫెక్ట్ కానీ ఎక్కడా కనిపించడం లేదు అని హై కమాండ్ కి నివేదికలు వెళ్లాయని అంటున్నారు. సరిగ్గా మూడేళ్ల వైసిపి పాలన నిండిన తర్వాత సొంత పార్టీకి చెందిన వారే కొందరు టిడిపి తో మరికొందరు జనసేనతో టచ్ లోకి వెళ్తున్నట్లుగా రిపోర్ట్ లు వచ్చాయి.. ఇంకొంతమంది ఎంపీలు బిజెపికి టచ్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.. తాజాగా వచ్చిన సర్వేలలో కూడా ఎవరి మటుకు వారు ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్నారని తెలుస్తోంది.. ఏపీలో వైసిపి రావడం డౌట్ అని వారికి ముందుగానే తెలిసి ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే..

CM Jagan suspicious plan for future elections
CM Jagan suspicious plan for future elections

మంత్రులు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదని.. చాలామంది మంత్రులు ఏపీలో ఏమి జరుగుతున్నా తమకు పట్టినట్టుగా ఉంటున్నారని.. వారి పని వాళ్లు చూసుకుంటున్నారని ఆ నివేదికలో పీకే టీం స్పష్టం చేసింది. ఇటీవల టిడిపి నుంచి వస్తున్న విమర్శలను కూడా వాళ్ళు పట్టించుకోవడంలేదని తిప్పి కొట్టడం లేదని ఆ నివేదికలో పేర్కొంది.. ఎవరికివారు వారి పబ్బం కడుపుకుంటున్నారే కానీ పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే జగన్ నేరుగా జనాలతో కనెక్షన్ పెట్టుకున్నారు.. నగదు బదిలీ పథకాన్ని ఆయన అమలు చేయడం వెనుక కూడా ఇదే కారణం అని చెబుతున్నారు. రేపటి రోజున ఈ రకమైన చర్యల వల్ల ఏ నాయకుడు హ్యాండ్ ఇచ్చినా ప్రజలతో టచ్ లో ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే.. ఆయన మూడేళ్ల నుంచి ఇదే బాటన ఉన్నారని మరికొందరు అంటున్నారు..