CM Jagan: ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల కాక రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరడం ఇప్పుడు సంచలనంగా మారింది.. దమ్ముంటే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలలో 175 కి 175 స్థానాల్లో పోటీ చేయాలి. 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా? అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం జగన్ వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసానిధులు విడుదల చేశారు.
పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కూడా పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతులను వంచించిన చంద్రబాబుకు.. రైతుల కోసం పనిచేస్తున్న మీ బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోంది. కరువుతో ఫ్రెండ్షిప్ చేసే చంద్రబాబుకు .. వరుణుడి ఆశీస్సులు ఉన్న మీ బిడ్డ జగన్ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. మీ బిడ్డకు భయం లేదు.. మీ ఆశీస్సులు ఉన్నాయి.. చంద్రబాబుకు గాని, దత్త పుత్రుడికి గాని 175 స్థానాలకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని సవాలు విసిరారు.. దీంతో ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది