Use of chits : ప్రతి ఒక్కరూ వారి సంపాదించిన డబ్బులను కూడా పెట్టి లక్షాధికారి కావాలని అనుకుంటారు.. అందుకు ప్రధాన మార్గాలలో చిట్టి కూడా ఒకటి. ఇంతకీ ఈ చిట్టీలు వేస్తే మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మనము ఒక లక్ష రూపాయల చిట్టి వేసినప్పుడు వాటికి పాట పాడతారు. ఇందులో ముఖ్యంగా ప్రతినెలా పాడిన పాటలో చిట్టీలు వేస్తున్నవారు వారి అవసరాన్ని బట్టి 65 వేల నుంచి చిట్టి లను తీసుకుంటారు. అదే మొదటిసారి తీసుకున్నవారికి 60 నుంచి 65 వేలు తీసుకున్నా కానీ వాటిని చివరి వరకు కట్టాలి. అయితే ఈ మధ్యలో తీసుకున్న 65 వేల నుంచి ఒక నిండే వరకు కట్టాలి.
మీరు ముందే తక్కువ డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఒక లక్ష నిండేవరకు కడితే వాటీ వడ్డీ డబ్బులు అన్నీ అవుతాయా.. లేదా అనేది మనం తప్పనిసరిగా ఆలోచించాలి. అవసరాలకు చిట్టీ పెద్దపెద్ద అమౌంటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిట్టీలు వేసేటప్పుడు నాకు దగ్గరగా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర, స్నేహితుల మధ్యలో లేదా బాగా గుర్తింపు పొందినటువంటి సంస్థలో మనం సేఫ్ గా చిట్టీలు వేసుకోవచ్చు.
అయితే పెద్ద పెద్ద అంకెల రూపంలో చిట్టిలు వేసినప్పుడు కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు సడన్ గా బోర్డు తిప్పివేయడం లాంటివి చేసినప్పుడు మనం నష్ట పోవాల్సిందే. ముఖ్యంగా భర్తకు తెలియకుండా భార్యలు, భార్యకు తెలియకుండా భర్తలు సపరేట్ గా చిట్టి వేసే పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉన్నాయి. ఇది సంతోషంతో కూడిన బాధాకరం.. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా పోగు చేయడం అనేది రిస్కు చేసినట్టే అని చెప్పవచ్చు. కానీ కొంతమంది పిల్లల కోసమో కుటుంబం కోసమో ఒకరికి తెలియకుండా ఒకరు ఆదా చేయాలని అనుకుంటున్నారు.
కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగరానిది జరిగితే ఆ భారం అనేది, ఆ బాధ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటప్పుడు ఎవరికి తెలియకుండా కూడా చిట్టీలు వెయకండి. ముఖ్యంగా చిట్టిల విషయంలో మనం కట్టే డబ్బులు, వచ్చే డబ్బు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ముందే చిట్టి పాట పాడి తీసుకుంటే ఆ తీసుకున్న డబ్బు మన ఇంట్రెస్ట్ కట్టే దాని కంటే ఎక్కువగా ఉపయోగం ఉంటుందా అనేది చూడాలి. ఏదో పనికిరాని పనులకు డబ్బులు తీసుకొని మళ్లీ అంత ఇంట్రెస్ట్ కట్టడం అనేది మనం నష్టపోవడానికి దారితీయవచ్చు. చిట్టీ వేసే ముందు పైన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.