Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా తో హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.. దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు కానీ వాళ్ల ఆనందాన్ని చిరు ఆవిరి చేసినట్లు తెలుస్తోంది ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన ఫ్యాన్స్ కు బాధగా ఉంది..
చిరు రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా రీమేకులే చేస్తున్నాడు. అవి ఫ్యాన్స్‌కు గునపాల్లా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే అవి ఊహించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు.. ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాథర్, రేపు వస్తోన్న భోళాశంకర్ తో పాటు ఆ వెంటనే అజిత్ నటించి తెలుగులో కూడా వచ్చేసిన విశ్వాసం సినిమా రీమేక్‌లో నటించబోతున్నాడట చిరు. ఈ సినిమాకి చిరు ఓకే చెప్పేశాడని.. ఈ సినిమాకు వివి. వినాయక్ దర్శకత్వం చేయనున్నరాని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అజిత్ నటించిన విశ్వాసం చిత్రం తెలుగులో రిలీజ్ చేసినా ఎవ్వరూ చూడలేదు.. ఇప్పుడు అదే సినిమా చిరంజీవి మళ్ళీ రీమేక్ చేస్తే కావాలని దరిద్రాన్ని వెంట మోసుకు వెళ్ళడం తప్ప మరి ఇంకేంటి అంటూ సినీ ప్రేక్షకులు మండిపడుతున్నారు. వీర సింహారెడ్డి సినిమా కి వాల్తేరు వీరయ్య గట్టి పోటీని ఇచ్చింది. అయితే ప్రతిసారి చిరంజీవి మాస్ ఫార్ములా సెట్ కాదు కదా అని అందరి వాదన. ఇక నుంచి మెగాస్టార్ రీమేక్ చిత్రాలలో నటించకుండా ఉంటే బాగుంటుందని మెగా ఫాన్స్ కోరుకుంటూ చిరంజీవి మళ్ళీ మరో రీమేక్ చిత్రానికి ఒప్పుకోవడం ఆయన ఫ్యాన్స్ గుండెల్లో గుణపం లాంటి వార్త కాకపోతే మరి ఇంకేంటి..
విశ్వాసం సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. కూతురు సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సినిమాకు మాస్ మసాలా దినుసులు అద్దేసి తెలుగులో చిరు రీమేక్ చేస్తే గాడ్ ఫాథర్‌లాగానే ఉంటుందేమో ? అన్న సందేహాలు వస్తున్నాయి. చిరంజీవిని ఈ రీమేక్ చిత్రానికి ఒప్పుకోవద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.