Mobile : మొబైల్లో డేటా లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..!!

Mobile : సాధారణంగా ఫోన్ పే , నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్లైన్ యాప్ల ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే కచ్చితంగా మన స్మార్ట్ ఫోన్లో డేటా కచ్చితంగా ఉండాల్సిందే. మరి డేటా లేకపోయినా కేవలం ఆధార్ కార్డు సహాయంతో మొబైల్ ఫోన్ నుంచి బ్యాంకు బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ప్రధమంగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ కార్డు లేకపోతే ఏ పని జరగదు. అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ గా ఆధార్ ప్రావీణ్యత పొందింది. ఇక భారతీయ పౌరులకు ఈ 12 అంకెల గుర్తింపు కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.

మన ఆధార్ కార్డును, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు వంటి వాటికి లింకు చేయాల్సి ఉంటుంది అని వ్యక్తిగత సమాచారం ఉంటుంది. అంతేకాదు ఐరిస్ స్కాన్ తో పాటు ఫింగర్ ప్రింట్ వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని కూడా దీనికి లింకు చేసి ఉంటారు. ఇకపోతే మీరు ఈ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ను ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు వీలు కల్పించబడింది.మీరు ఈ బ్యాంకు కి లేదా ఏటీఎం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు . అంతే కాదు ఈ సర్వీస్ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడని వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

Check the bank balance even if there is no data on the mobile
Check the bank balance even if there is no data on the mobile

ఇంటర్నెట్ కనెక్షన్ లేని సమయంలో ఈ సర్వీస్ చాలా బాగా ఉపయోగపరంగా ఉంటుంది.ఇక మీరు మీ మొబైల్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవాలి అనుకుంటే.. తొలత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి *99*99*1# కి డయల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్ ను రీ వెరిఫై చేసేందుకు మరోసారి ఆ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఇక ఆ తర్వాత యు ఐ డి ఏ ఐ మీ ఫోన్ కి ఒక ఫ్లాష్ ఎస్ఎంఎస్ ని పంపిస్తుంది. ఇక అందులో మీ బ్యాంకు బ్యాలెన్స్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దీన్ని బట్టి మీ ఫోన్లో డేటా లేకపోయినా సరే ఈ నెంబర్ కు కాల్ చేసి మీ బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.