Aadhaar Card : భారతదేశ పౌరుడిగా జీవించాలి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని జారీ చేస్తుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది వ్యక్తి జీవితానికి అత్యంత ముఖ్యమైన పత్రం అని చెప్పవచ్చు. ఇకపోతే ఆధార్ కార్డులో ఉండే 12 అంకెల గుర్తింపు వ్యక్తిని గుర్తిస్తుంది. ఇక ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ భిన్నంగా ఉంటుంది. ఇదే కాకుండా ఆధార్ కార్డు లో వ్యక్తి పేరు , ఫోటో , ఫోన్ నెంబర్ , చిరునామా, ఫింగర్ ప్రింట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ కూడా రకరకాలుగా సమాచారం ఉంటుంది . ఇక దీనికి మొబైల్ నెంబర్ కి లింక్ చేయడం కూడా అత్యవసరం. ఇక ఈ పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డులో పేరు, ఫోటో, చిరునామా, మొబైల్ నెంబర్ ఇలా ఏదైనా సరే పొరపాటు ఉంటే అప్డేట్ చేయాలనుకుంటే కొంచెం కష్టతరమవుతుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మీసేవ సెంటర్లు కూడా ఎక్కడ అగుపించలేదు. అందుకే తప్పులు ఉంటే సరి చేసుకోవాలి.. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే ఏ సహాయం కూడా మీకు వర్తించదు.
మరి ఆధార్ కార్డులో పేరు, చిరునామా ను ఎలా అప్డేట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. https://uidai.gov.in/ వెబ్సైట్ కి లాగిన్ అయ్యి..
My Aadhaar కింద Update your Aadhaar పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్డేట్ డెమోగ్రాఫిక్స్ లేదా ఆన్లైన్ పై క్లిక్ చేయండి.
ఇక ఇప్పుడు ఆధార్ అప్డేట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిపై క్లిక్ చేసి ఆ తర్వాత లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ పేరు చిరునామా మార్చుకునే ఎంపికను గమనించవచ్చు. ఇక అక్కడ ఏది మార్చాలి అనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.
ఇక పేరు మార్చాలనుకుంటే పేరు చిరునామా మార్చాలనుకుంటే చిరునామా ఇలా అవసరమైన సమాచారాన్ని అందించి రుజువు కూడా అందివ్వాలి. ఇక్కడ మీరు రూ.50 ఆన్లైన్ చెల్లింపు చేయాలి.
ఇక మీ ఆధార్ నెంబర్కు లింక్ అయినా ఫోన్ నెంబర్కు కచ్చితంగా అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరి కొద్ది నిమిషాల్లోనే మీరు మార్చాలి అనుకున్న పేరు లేదా చిరునామా రెండు కూడా అప్డేట్ అవుతాయి.ఇక ఒకవేళ మొబైల్ నెంబర్ ని మీరు మార్చాలి లేదా లింక్ చేయాలి అనుకుంటే..
uidai.gov.in వెబ్సైట్ కి లాగిన్ అయ్యి Get Aadhaar పై క్లిక్ చేయండి. ఇక ఇక్కడ ఆధార్ కరెక్షన్ ఫారం ను పూరి చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 50 రూపాయలు ఆన్లైన్ చెల్లింపు చేసి అప్డేట్ చేస్తే తర్వాత 90 రోజుల్లో అప్డేట్ లభిస్తుంది.