Central Government.. సెలబ్రిటీలకు షాక్ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గైడ్ లైన్స్ ను తీసుకొచ్చింది. అభిమానులను, ఆడియన్స్ను తప్పుదారి పట్టించకుండా కట్టడి చేసింది. అసలు విషయంలోకి వెళితే సినిమా వాళ్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్లు కనిపిస్తే ఎగిరి వెళ్లి టచ్ చేయాలనే ఆరాటంతో పాటు.. వాళ్లు వాడే వస్తువులు, తినే తిండిని కూడా పిచ్చిగా ఫాలో అవుతూ ఉంటారు జనాలు.. ఇలా ఫాలోయింగ్ క్యాష్ చేసుకోవడానికి రకరకాల కంపెనీలు సెలబ్రిటీలకు కోట్లకు కోట్లు ఎరవేసి వారి ఉత్పత్తులకు అడ్వర్టైజ్ చేయిస్తున్నారు.
జనాలు మాత్రం అసలు అది వారు వాడుతారా? లేదా? అనేది కూడా చూసుకోకుండా అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోకుండా ఎగబడి కొనేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది స్టార్ల మీద పిచ్చితో అలా చేస్తున్నారు. అందుకే వినియోగదారులు నష్టపోతున్నారని తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం సెలబ్రిటీలకు షాక్ తీస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే బ్రాండ్ ప్రమోషన్ ల పై సెలబ్రిటీలకు నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ఎఫైర్స్ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. సెలబ్రిటీలు ఏదైనా వస్తు లేదా సేవలను ప్రమోట్ చేసే ముందు వాటిని తప్పకుండా వినియోగించాలని స్పష్టం చేసింది . అంతే కాదు వాటి ద్వారా ఎదురైన అనుభవాలను తెలుపుతూ ప్రచారం చేయాలని పేర్కొంది. ఫొటో లేదా వీడియోల ద్వారా చేసే ప్రచారం స్పష్టంగా ఉండాలని ఒక వస్తువులో లేని గుణాల గురించి చెప్పే ప్రచారం చేయడం నేరమని వెల్లడించింది. దీంతో సెలబ్రిటీలకు షాక్ తగిలినట్టు అయింది.