Jobs : నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఏవో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నది.. ఇప్పుడు తాజాగా ప్రముఖ బ్రాండ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్..BECIL లో పలురకాల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 96 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.. అందులో ఏ విభాగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నవి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య..96
ఇందులో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ-51 పోస్టులు.
రేడియో గ్రాఫర్ పోస్టుల సంఖ్య-22
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్-8 పోస్టులు.
ఫెబోటమిస్ట్-1 పోస్ట్.
ల్యాబ్ అటెండెంట్-14 పోస్ట్లు. ఈ విధంగా మొత్తం పోస్టులన్నీ ఖాళీగా ఉన్నది.
2).అర్హతలు: పైన పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే వారు బిఎస్సి రేడియాలజీ, ఎమ్మెల్టీ, లైఫ్ సైన్స్, మెడికల్ ల్యాబ్ గ్రేటర్ టెక్నాలజీస్ట్, ఇంటర్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర విషయాలు:
1). ఆసక్తికరమైన అభ్యర్థులు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2). అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆధారంగా రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
3).అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ:
1). ముందుగా అధికారిక వెబ్సైట్లో..www.becil.com లోకి వెళ్లాలి.
2). ఆ తర్వాత కెరియర్ సెక్షన్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పైన
క్లిక్ చేయవలసి ఉంటుంది.
3). ఇక అక్కడ చూపించిన విధంగా పూర్తి వివరాలను అందించి.. మన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు ఓకే అయిన తర్వాత అప్లికేషను పిడిఎఫ్ రూపంలో మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇక అప్లై చేసే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.