CBI: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐ దూకుడు పెంచుతోంది. నిన్న వైయస్ అవినాష్ రెడ్డిని ఏకంగా నాలుగున్నర గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు ఈరోజు కడప సెంట్రల్ జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డిని విచారించనున్నట్లు సమాచారం. వైయస్ భాస్కర్ రెడ్డి ఎవరో కాదు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి..ఈయన ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు.. అయితే విచారణకు హాజరు కావాలి అంటూ నిన్న కూడా ఆయనకు వాట్సాప్ ద్వారా మరొకసారి నోటీసులు పంపించింది సీబీఐ.
వివేక హత్య గురించి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో భాస్కర్ రెడ్డిని కుట్ర దారుడిగా సీబీఐ నిర్ధారించగా అవినాష్ రెడ్డి చంపారు అని నిందితుడిగా లెక్క కట్టారు. మరి దీనిపై ఇంకా పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడనుంది.