Health Tips : జామ ఆకు తో ఇన్ని రోగాలను నయం చేయవచ్చా..?

Health Tips : ఈ బిజీ షెడ్యూల్స్‌, జీవితాల వల్ల చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం అనేది అసాధ్యం.. మనిషి జబ్బు బారిన పడ్డ తర్వాత రసాయన మందులు వేసుకోవడం మొదలుపెడతాడు.అవి అప్పటికప్పుడు తగ్గించినా అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంటాయి.అయితేఎన్నో జబ్బులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత అయినా ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయం చేసుకోవచ్చు. అలాంటి కోవలోకే వస్తుంది జామాకు వైద్యం. అవును జామ కాయల కంటే జామ ఆకులకు ఆయుర్వేంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.జామాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జామ ఆకుల్లో ట్యానిక్స్‌, ఆక్సలేట్‌ లు ఉంటాయి.అవి మంచి యాంటీ బయోటిక్స్‌గా పని చేస్తాయి.ఇందులో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వైరల్ ఇన్ఫెక్షన్ ని దూరంగా ఉంచుతాయి. సాధారణంగా చాలా మందికి బి కాంప్లెక్స్ తక్కువగా ఉండటం వల్ల నోట్లో పూత, పుండ్లు, గొంతు నొప్పి వస్తుంటాయి. అలాంటి వారు లేత జామ ఆకుల్ని నమిలి కొద్ది సమయం నోట్లోనే ఆ పిప్పిని చప్పరిస్తుండాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండూ పూటలా చేస్తే ఇట్టే తగ్గిపోతాయి. కొంతమంది కి జీర్ణ సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివారు లేత జామ ఆకుల్ని నీటిలో మరిగించి, ఆ తర్వాత నీటి నుండి ఆకుల్ని వేరు చేసి ఆ నీటిని గోరు వెచ్చగా వున్నప్పుడే తాగడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.ఇలా పరగడుపునే చేస్తే కడుపులో సమస్య ఉన్నా కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు.

Health Benefits of guava leaf
Health Benefits of guava leaf

క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా జామాకులను వాడుకోవచ్చు. ఇందులో క్యాన్సర్ కి కారణమయే ప్రీ రేడికల్స్ ని తొలగించే గుణం ఉంటుంది.వారంలో ఒకటి లేదా రెండు సార్లు జామ ఆకు చూర్ణంను వేడి నీటిలో వేసి మరిగించి కషాయం చేసుకొని తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లకు దూరంగా ఉండవచ్చు. అధిక బరువు కలవారికి కూడా జామాకు కషాయం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ఇందులో ఉండే పైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ ని కరిగించి బరువును అదుపులో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా సీజనల్ మార్పులు వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి. అలాంటి వారికి జామాకు కషాయం యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు రోజుకు రెండు పూటలా ఈ కషాయం తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి జామాకు కషాయం అప్పుడప్పుడు తాగడం అలవాటు చేసుకొని మంచి ఆరోగ్య ఫలితాలను పొందండి.