Bank Phone Call : బ్యాంకు మేనేజర్ అని ఫోన్ చేసిన అతగాడిని ఓ ఆట ఆడుకున్న పల్లెటూరి అమ్మాయి..

Bank Phone Call : మోసగాళ్లు బ్యాంక్ ఖాతాదారుల డబ్బు స్వాహా చేసేందుకు వారి ఆధార్ నెంబర్లను తెలుసుకునేందుకు మభ్యపెట్టడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు.. మీ ఆధార్ నెంబర్ లేదా ఓటీపీ లేదా పాస్వర్డ్ కోసం బ్యాంక్ అధికారులమని చెప్పుకునే వ్యక్తులు.. మీకు ఎప్పుడైనా కాల్ చేసినట్లయితే వారు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న స్కామ్ స్కర్ట్ అయ్యే అవకాశం ఉందని గతంలో పలు వార్తలు వచ్చాయి.. ప్రస్తుతం అలాగే ఒక మహిళకు బ్యాంక్ అధికారిని కాల్ చేయగా ఆ మహిళ అతనితో ఏ విధంగా మాట్లాడిందో అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


నేను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ని మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పమని ఒక అతగాడు ఒకాయనకి ఫోన్ చేసి మాట్లాడుతాడు. అయితే అతను అసలు మీరు ఎవరు ఎందుకు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు అని అడగగా.. మీ ఎకౌంటు బ్లాక్ అయిందని వెంటనే రెన్యువల్ చేయాలని.. రెన్యువల్ చేయకపోతే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని.. త్వరగా మీ ఆధార్ కార్డు నెంబరు చెప్పమని అడుగుతారు. లేదంటే మీ ఏటీఎం కార్డు 16 అంకెల నెంబరు చెప్పమని అతను అడుగుతారు. ఈ వ్యవహారం మీద తేడాగా ఉందని అతను తన కూతురికి ఈ ఫోన్ ఇస్తాడు. వెంటనే ఆ అమ్మాయి ఫోన్లో అసలు మీరు ఎవరండి అని అడుగుతుంది..

అయితే నేను బ్యాంకు మేనేజర్ ని అని చెబుతాడు మాకు చాలా బ్యాంకు ఎకౌంట్లో ఉన్నాయని.. మీరు ఎవరని అడుగుతుంది కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ అకౌంట్ కి లింక్ అయి ఉన్న ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని మాకు మెసేజ్ వచ్చింది. మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి. లేదంటే మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పమని అతను అడుగుతాడు. లేదండి నేను బయట ఉన్నాను. నా దగ్గర ఆధార్ కార్డు నెంబర్ లేదని ఆమె చెబుతుంది. కనీసం ఏటీఎం కార్డు 16 అంకెల నెంబర్ చెప్పమన్న అది కూడా లేదని చెబుతుంది. నేను ఏవైనా సరే బ్యాంకుకు వెళ్లి చూసుకుంటానని ఆమె చెబుతుంది. లేదు ఇప్పుడే వెంటనే చెప్పాలని అతను అంటాడు.

బ్యాంకు కరోనా అని ప్రస్తుతం వర్కింగ్ లో లేవని అతగాడు చెబుతాడు. లేదు బ్యాంకు వర్కింగ్ లోనే ఉంది. పైగా మా ఇంటి పక్కనే ఆ బ్యాంక్ అని ఆమె చెబుతుంది. నేను ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ నెంబర్స్ కానీ ఏమైనా సరే బ్యాంకుకు వెళ్లే చెబుతానని.. ఆ అమ్మాయి కరాకండిగా చెప్పేస్తుంది. ఇక వెంటనే ఆ బ్యాంకు మేనేజర్ నెంబరు వారి దగ్గర ఉండటంతో.. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి అడగగా బ్యాంకు నుంచి మీకు ఎలాంటి కాల్స్ రావండి.. ఇదంతా స్కామ్ చేయడానికి కొంతమంది డబ్బులు పొందే ప్రయత్నంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఫోన్లో మీరు ఎలాంటి ఓటీపీ లు కార్డు నెంబర్లు, ఆధార్ నెంబర్లు తెలుపవద్దని ఆ బ్యాంకు మేనేజర్ తెలుపుతారు. వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఇలాంటి ఫోన్స్ వస్తున్నాయని తెలియజేయండి. వాళ్లు కూడా అప్రమత్తంగా ఉంటారని ఆ బ్యాంకు మేనేజర్ వారికి తెలిపారు.