ముఖ్యంగా వివాహం అయిన తర్వాత స్త్రీలు ఒకరి మీద ఆధారపడకుండా ఆర్థికంగా మెరుగు పడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు.. ఇంటి అవసరాలను మొదలు కొని , సొంత అవసరాలు అలాగే పిల్లల అవసరాలు ఇలా ప్రతి విషయంలో కూడా స్త్రీలకు డబ్బు అనేది అవసరం అవుతుంది. ప్రతిసారి భర్తను లేదా ఇంట్లో వారిని అడుగుతూ ఇబ్బంది పాలవుతూ ఉంటారు. అందుకే వివాహితులైన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడితే మీరు ఆర్థికంగా భయపడాల్సిన అవసరం ఉండదు.

1. బేకరీ : బేకరీ పెట్టుకోవడం వల్ల బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. పైగా ఇంట్లోనే నచ్చిన.. రుచికరమైన బేకరీ ఐటమ్స్ తయారు చేయడం వల్ల కస్టమర్లను బాగా ఆకర్షించవచ్చు. నాణ్యమైన బేకరీ ఉత్పత్తులను తయారు చేయడం వల్ల కూడా కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు. తక్కువ ఖర్చుతో బేకరీ ఉత్పత్తులను తయారు చేసి ఎక్కువ లాభాలను పొందవచ్చు.
2. డే కేర్ సెంటర్ : ఆఫీసులకు వెళ్లే తల్లులు తమ పిల్లల జాగ్రత్తల కోసం డే కేర్ సెంటర్లలో వదిలిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డే కేర్ సెంటర్ నిర్వహిస్తూ వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కూడా డబ్బులను సంపాదించవచ్చు.
3. ఈవెంట్ మేనేజర్ : దేనినైనా అలంకరించడంలో అమ్మాయిల తర్వాతే మరెవరైనా అని చెప్పవచ్చు. అందుకే అమ్మాయిలు ఎక్కువగా ఈవెంట్ మేనేజర్లు గా వ్యవహరిస్తున్నారు. వివాహ వేడుకలకు .. పుట్టినరోజు సందర్భాలకు ఇలా ఎన్నో వేడుకలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఏదైనా ఒక వివాహ వేడుకకు కరెక్ట్ గా మేనేజ్ చేసి అలంకరణ పూర్తి చేశారు అంటే ఇది చూసి నచ్చినవారు తప్పకుండా అవకాశాలను అందిస్తారు.
వీటితో పాటు బ్యూటీ పార్లర్, పాల వ్యాపారం , కొవ్వొత్తుల తయారీ.. పేపర్ ప్లేట్స్ తయారీ.. యూ ట్యూబ్ , కంటెంట్ రైటర్ ఇలా చెప్పుకుంటూపోతే చిన్న చిన్న వాటితోనే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు.