Business Idea : పెట్టుబడి లేని బిజినెస్ ఐడియాస్ మీకోసం.. లక్షల్లో ఆదాయం..!!

Business Idea : ఇటీవల కాలంలో చాలామంది ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. కానీ బిజినెస్ చేయాలి అంటే ముందు పూర్తిగా ఆ బిజినెస్ పై అవగాహన కలిగి ఉండాలి. ఇక బిజినెస్ చేసే ముందు లాభనష్టాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి బిజినెస్ చేస్తే .. ఎక్కడ నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి ఇలా ప్రతి విషయాలను కూడా ఆచితూచి అంచనా వేసిన తర్వాత నే వ్యాపారం మొదలు పెట్టడం ఉత్తమమైన పద్ధతి. బిజినెస్ పెట్టాలి అంటే కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్న పని.. కాబట్టి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. మీరు కూడా బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే.. పెట్టుబడి లేని కొన్ని రకాల బిజినెస్ ఐడియాస్ ను ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది.. ఈ ఐడియాలతో పెట్టుబడి లేకుండా లక్షల రూపాయలను లాభాలను పొందవచ్చు. ఇక ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1. ఇంస్టాగ్రామ్ : బెస్ట్ సోషల్ మీడియా ఎర్నింగ్ యాప్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెబుతూ ఉంటారు. ఇక మీరు ఇంస్టాగ్రామ్ లో ఒక గ్రూపును క్రియేట్ చేసుకొని.. ఒక కంపెనీ ఇచ్చిన ప్రాజెక్టును మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నట్లయితే ఆ సేల్స్ ద్వారా మీరు పర్సంటేజ్ ను పొందవచ్చు. లేదా మీరు కూడా ఇంస్టాగ్రామ్ ఉపయోగించి కొన్ని రకాల సేల్స్ చేపట్టి మంచి లాభాలను పొందవచ్చు. ఇక ఏదైనా అందమైన.. ఆకర్షణీయమైన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లను కూడా సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ వేదికగా సేల్ చేయవచ్చు. ఇందుకోసం మీకు ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు కేవలం ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి మంచి లాభం పొందవచ్చు.

Business idea without investment for you
Business idea without investment for you

2. యూట్యూబ్ : యూట్యూబ్లో మీరు ఒక ఛానల్ ను ఓపెన్ చేసి.. మీకున్న ప్రతిభను అందులో పోస్ట్ చేసినట్లయితే మంచి లాభం వస్తుంది . అయితే ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్లు లను మీరు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు పెట్టే వీడియోలకు గూగుల్ యాడ్స్ వస్తాయి కదా వాటి ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. ఇక మీరు పెట్టే వీడియోలో వచ్చే గూగుల్ యాడ్స్ ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు అన్నమాట. ఇందుకోసం ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు.

3. ఆన్లైన్ ట్యూషన్స్ : ఇక యూట్యూబ్ ద్వారా పిల్లలకు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పవచ్చు . ఇందులో జాయిన్ అనే ఆప్షన్ ద్వారా పిల్లలను చేర్చుకొని గూగుల్ యాడ్స్ ఇచ్చే డబ్బులతో పాటు జాయిన్ అనే ఆప్షన్ ద్వారా కూడా డబ్బు పొందవచ్చు. ఇక జాయిన్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు పిల్లలు రూ.120 నుండి రూ. 200 లోపు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇక ఇలా ఇంట్లో ఉంటూనే పిల్లలకు ట్యూషన్ చెబుతూ మంచి లాభార్జన పొందవచ్చు.

4. సర్వీస్ : ప్రస్తుతం ఆన్ లైన్ ఆర్డర్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ వస్తువులను మీరు ఒక చోటు నుంచి ఇంకొక చోటకు సర్వీస్ చేసినట్లయితే కమిషన్ పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో ఏ చిన్న వస్తువులు కావాలి అన్నా సరే సర్వీసింగ్ అనేది చాలా ముఖ్యం గా మారిపోయింది ఇక అలాంటి సర్వీసింగ్ పద్ధతిని ఎంచుకున్నట్లు అయితే మంచి డబ్బు పొందవచ్చు. ఇక వస్తువు యొక్క విలువను బట్టి దూరాన్ని బట్టి మీకు పర్సంటేజ్ అనేది నిర్ణయించబడుతుంది. లాండ్రి , గ్రోసెరీ,వెజిటేబుల్స్ ఇలా రకరకాల సర్వీసింగ్ చేయవచ్చు.

5. హోమ్ కేర్ సెంటర్స్ : మీరు వయసులో ఉండి పిల్లలను ఆడించగలిగే శక్తి ఉంటే హోమ్ కేర్ సెంటర్ ద్వారా మంచి లాభాన్ని పొందవచ్చు. ఇటీవల కాలంలో చాలా మంది తల్లిదండ్రులు బిజీ లైఫ్ స్టైల్ ను గడుపుతున్న సందర్భంగా పిల్లల్ని చూసుకునే సమయం లేక ఇలా హోమ్ కేర్ సెంటర్స్ లో వదులుతున్నారు. ఇక ఇలా వారి పిల్లలను మీరు చూసుకున్నట్లయితే నెలకు అమౌంట్ ను పొందే అవకాశం వుంటుంది .ఇందుకోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు.