Business Idea : ఈ పంటలతో రైతు రాజు కావాల్సిందే.. ఎలాగో చూడండి మరీ..!!

Business Idea : భారత దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు.. కానీ రైతు పండిస్తున్న పంటలు సరిగా పండక ఒకవేళ పండిన పంటకు సరైన గిట్టుబాటు లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు మనం రోజుకొకటి చొప్పున వింటూనే ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రైతు మాత్రం రాజు కాలేకపోతున్నారు. ఎన్నో సమస్యలు , మరెన్నో చిక్కులు, చికాకులు ఇలా కుటుంబ బాధ్యతలు , పిల్లల చదువులు అన్నీ తట్టుకోలేక చివరికి చావే శరణ్యం అని స్మశాన బాట పడుతున్నాడు. ఇక రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేసి.. వారిని లక్షాధికారులను చేసే అద్భుతమైన సాగు గురించి ఈ రోజు మేము మీ ముందుకు తీసుకు వచ్చాము. ఎలాంటి వాతావరణంలోనైనా సరే ఈ పంటలు పండడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా బాగా పలుకుతుంది.మరీ ముఖ్యంగా రైతులు ఈ పంటలను పండిస్తే..అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. మరి రైతులను లక్షాధికారులను చేసే ఈ సాగు గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..మన దేశంలో అనేక రకాల ఆకులతో చేసే వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇక వాటిలో కొన్ని రకాల ఆకులు వేరు వేరు చోట్ల వేరు వేరు శుభకార్యాలకు అవసరం అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆకులు పూజలు, శుభకార్యాలలో అవసరమైతే మరికొన్ని ఆహారంలో వినియోగిస్తున్నారు.. ఇక వీటిలో తమలపాకు, అరటి ఆకు మాత్రమే కాకుండా మరొక ఆకు కూడా ఉంది. అదే సాఖూ ఆకు.. ఇక వీటికి కూడా మన మార్కెట్లో పెద్ద డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో అరటి ఆకులకు ఎంత డిమాండ్ అయితే ఉందో ఉత్తర , తూర్పు భారతదేశంలో తమలపాకులకు అంతే గిరాకి ఉంది. ఇక కొండ ప్రాంతాలలో సాఖూ ఆకులకు కూడా మంచి డిమాండ్ ఉండటం గమనార్హం.ఇక ఈ మూడు రకాల ఆకులను రైతులు పండించడం వల్ల ఆదాయం బాగా రావడంతో పాటు అప్పులు తొలగిపోయి, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక మూడు ఆకుల పంటల గురించి ఇప్పుడు ఒకసారి మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయేముందు ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక రైతు కుటుంబానికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించగలరు.

Advertisement
Business Idea With these crops the farmer must become king
Business Idea With these crops the farmer must become king

1. అరటి ఆకుల సాగు : మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని సాగు అని చెప్పవచ్చు. అరటి మొక్కలను నాటడం వల్ల పండ్లతో పాటు ఆకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. రైతులకు ఇది ఒక మంచి వనరు అని చెప్పవచ్చు అరటి ఆకులు సాధారణంగా దక్షిణ భారత దేశంలోని ప్రతి ఇళ్లల్లో కూడా ప్రత్యేక సందర్భాలలో వీటిలో ఆహారం వడ్డించడానికి ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా కొన్ని హోటల్స్ లో ప్రత్యేకంగా అరిటాకులో భోజనం వండిస్తూ ఉండటం గమనార్హం. కాబట్టి ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఈ అరటి మొక్కల సాగు మంచి ఆదాయాన్ని అందిస్తుంది.అరటి పండ్లతో పాటు ఆకుల నుండి కూడా లాభం లభిస్తుంది కాబట్టి రెట్టింపు లాభాలను రైతు పొందవచ్చు.

2. తమలపాకు సాగు : భారతదేశంలో ఎప్పటికీ డిమాండ్ తగ్గని సాగు అనేది అంటే తమలపాకు సాగు అని చెప్పవచ్చు. తూర్పు, ఉత్తర భారతదేశంలో వీటికి ఎప్పుడూ కూడా డిమాండ్ తగ్గదు. రోజు వారి పూజలో అయినా సరే.. ప్రత్యేకమైన శుభకార్యాలు అయినా సరే తప్పకుండా తమలపాకుల వినియోగం లేకుండా ఏ కార్యక్రమం కూడా మొదలవ్వదు. అన్నిటికీ మించి పాన్ షాప్ లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తమలపాకు సాగు కొంచెం కష్టమే అయినప్పటికీ ఒకసారి తోట పెరిగితే మాత్రం మీ తలరాత మారినట్లే ముఖ్యంగా కొన్ని లక్షల్లో లాభాలు పొందవచ్చు.

3. సాఖూ ఆకు : ముఖ్యంగా ఈ చెట్టు మనకు కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. అరటి ఆకుల వలె ఇవి కూడా పెద్దగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారం వడ్డించడానికి ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. చాలా ఖరీదైనది. ఇక ఈ సాగు వల్ల ఆకులతో మాత్రమే కాకుండా కలప వల్ల కూడా మంచి లాభం పొందవచ్చు.

Advertisement