Business Idea : ఒక్క దెబ్బతో లైఫ్ సెట్ అయిపోవాలి అనుకున్న వాళ్లు మాత్రమే బిజినెస్ చేయాలి..!!

Business Idea : ప్రస్తుత కాలంలో భారీ యంత్రాలకు బదులుగా పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫోటో కాపీ యంత్రాలు గతంలో భారీగా ఉండేవి. అవి క్రమంగా పోర్టబుల్ జిరాక్స్ మిషన్స్ గా మారాయి. వాటర్ ప్యూరిఫైయర్లు, పిండి మిషన్లు పోర్టబుల్ అవతారంలో మార్కెట్లోకి వచ్చాయి. ఇదే క్రమంలో తందూర్ మిషన్లు చిన్న సైజులో లభ్యమవుతున్నాయి. వీటి వలన చిరు వ్యాపారాలను నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. తందూర్ కు ఫుడ్ ఐటమ్స్ లో ఉన్న ప్రాధాన్యతే వేరు. దీని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. తందూర్ నాన్ వెజ్, రోటీలకుడిమాండ్ ఎక్కువగా ఉంది.

తందూర్ మిషన్లు పిజ్జాలను తయారు చేయడానికి కూడా అవసరమవుతాయి. మైక్రో ఓవెన్ కన్నా చాలా తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. బొగ్గు మీద కావలసిన రుచిని అందించడంలో తందూర మిషన్ ద్వారా వండిన వంటకాల ప్రత్యేకత. నాన్ వెజ్, పిజ్జా, వెజ్, నాన్ రోటి, పరోటాలతోపాటు మంచి రెసిపీలనుకూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ల ఆధారంగా చాలా నగరాల్లో పిజ్జా సెంటర్లు వెలిశాయి. పిజ్జా బేసిన్ కొనుగోలు చేస్తే.. మిగతావన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చును. ఈ తందూర్ మిషన్ దీనికి బాగా ఉపయోగపడుతుంది.

Business Idea on food items for Tandoor
Business Idea on food items for Tandoor

ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వెరియంట్స్ ఉన్నాయి. వీటికి ధరలో కూడా తేడా ఉంది. ఈ ఆటోమేటిక్ వేరియంట్ లో టైమర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ 5,000 రూపాయలకే లభిస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ తందూర్ మిషన్ మాత్రం కాస్త ఖరీదే. 35 వేల రూపాయలు ఉంటుంది. వీటి ద్వారా పరోట, నాన్ రోటి, పిజ్జాలను తయారు చేసి విక్రయించవచ్చు. బల్క్ ఆర్డర్లను తీసుకోవచ్చు. ఓ చిన్న సైజు రెస్టారెంట్ ను కూడా ఇదే తందూర్ మిషన్ మీద ఆధారపడి మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీని మీద కాస్త పబ్లిసిటీ చేసుకోగలిగితే ప్రతి నెల వచ్చే లాభం వేల రూపాయల్లో ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లల్లో, తాముండే ప్రాంతాలలో జరిగే సెలబ్రేషన్స్ కు టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ను సరఫరా చేయవచ్చు.