Agriculture : అతి తక్కువ సమయంలో కోటీశ్వరులు. కావాలని అందరూ కోరుకుంటారు కదా… ఈరోజుల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కలలు కనేవారే ఎక్కువ. అయితే కాస్త తెలివి ఉపయోగించి కష్టపడితే ఇది సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో లాభాలను ఆశించి చాలా మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందుకనే వ్యవసాయానికి సంబంధించిన బిజినెస్ ఐడియాని మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మలబార్ వేప సాగు గురించి తెలుసుకుందాం.
ఇది చాలా వేగంగా పెరుగుతున్న చెట్టు కాబట్టి మీ పొలాల్లో ఇతర పంటల మధ్య దీనిని నాటవచ్చు. ఇంకా కోటేశ్వరులు కావాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది. మీరు ఈ చెట్లను ఎంత ఎక్కువ భూమిలో పెంచుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మలబార్ వేపను దుబియా చెట్టు అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రైతులు వీటిని పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ఈ చెట్టు సాధారణ వేప చెట్టు కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చెట్టు పెంచడానికి అధిక నీరు అవసరం లేదు. మార్చి- ఏప్రిల్ నెలల్లో ఈ మొక్కను నాటడం ఉతమైనది. 4 ఎకరాల పొలంలో 5000 మలబార్ వేప చెట్లను నాటవచ్చును.
ఈ చెట్టు చెక్కను నిర్మాణ పనుల్లో ఎక్కువగా వాడతారు. ఈ చెట్లకి చెదపురుగుల బెడద లేకపోవడంతో ప్లైవుడ్ పరిశ్రమలలో ఈ చెక్కను ఫేవరేట్‌గా పరిగణిస్తారు.ఈ చెట్టు నుంచి లాభాలు రావాలంటే నాటిన తరువాత 8 ఏళ్లు ఆగాల్సిందే. ఎంత ఆదాయం వస్తుందంటే.. ఈ చెట్టు కలపను క్వింటాల్ రూ. 500కి విక్రయిస్తున్నారు. ఒక చెట్టు 1.5 టన్నుల బరువు ఉంటుంది. మీరు ఒక చెట్టు నుంచి 6,000 – 7,000 వరకు సంపాదించవచ్చు.4 ఎకరాలలో 5,000 చెట్లు నాటితే, మీకు ఖర్చులు పోగా సులభంగా రూ. 50 లక్షల వరకు సంపాదించవచ్చు. పొలం విస్తీర్ణాన్ని పెంచి అందులో రెట్టింపు పంటను వేస్తే.. చెట్లను అమ్మి కోటీశ్వరులు కావొచ్చు.