Business Idea : చాలా సింపుల్ బిజినెస్ ఐడియా .. 15 వేల పెట్టుబడి .. నెలకి ఇరవై వేలు గ్యారెంటీ !

Business Idea : మీరు ఇంట్లోనే ఉండి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? ఇది డినుంండ్ ఎక్కువగా ఉన్న వ్యాపారం. అదే కొబ్బరి నీళ్ల వ్యాపారం. ఈ వ్యాపారం కొరకు మీకు చిన్న ఈ వ్యాపారం ద్వారా మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు. కొబ్బరి నీరు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్ళల్లో చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ బి, సెలీనియం, జింక్, అయోడిన్ మరియు సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. ఈ వ్యాపారానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. కొబ్బరి బోండాల కొనుగోలుకే ఎక్కువ ఖర్చవుతుంది. మీరు దుకాణాన్ని తెరవాలనుకుంటే మాత్రం స్థానిక మార్కెట్ రేటు ప్రకారంగా అద్దె వసూలు చేయబడుతుంది. అంచనా ప్రకారం, మీరు రూ. 15,000 పెట్టుబడి పెట్టి కొబ్బరి నీళ్ళ వ్యాపారం మొదలు పెట్టవచ్చు.

ప్రజలు ప్రయాణించేటప్పుడు లేక ఏదైనా వ్యాధితో బాధపడుతున్నపుడు కొబ్బరి నీటిని ఎక్కువగా తాగుతారు. కొబ్బరి నీటిని తీసి పేప‌ర్ కప్పులో ప్యాక్ చెసుకోవచ్చు. దీనివలన ప్రజలు కొబ్బరి నీటిని త్రాగడం సులభం అవుతుంది. మీ దుకాణానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ దుకాణంలో వీలైతే, వ్యక్తులు కూర్చునేందుకు స్థలాన్ని ఏర్పాటు చేయండి. కావాలంటే, కొన్ని కుర్చీలు లేదా ఏదైనా సీటింగ్ ఫర్నీచర్ను ఏర్పాటు చేయండి. కూలర్లు, ఫ్యాన్లు వంటివి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, వ్యక్తులు మీ దుకాణంలో ఎక్కువ కాలం ఉంటారు. ఇలా చేయడం ద్వారా వ్యాపారం త్వరగా వృద్ధి చెందుతుంది.

Business Idea in Coconut water business can be started
Business Idea in Coconut water business can be started

Business Idea : మీరు ఎంత సంపాదిస్తారు ?

ఏ వ్యాపారం మొదలు పెట్టినా త్వరగా వృద్ధి చెందాలంటే.. శుభ్రత చాలా ముఖ్యం. ప్రతీ ఒక్కరూ ఈ రోజుల్లో శుభ్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మీరు కూడా శుభ్రతను పాటిస్తే మీ వ్యాపారానికి తిరుగుండదు. మీరు కొబ్బరి నీటిని వాటర్ గ్లాస్ లో ప్యాక్ చేసి విక్రయిస్తే.. మంచి గిరాకీ కూడా ఉంటుంది. బయట దొరికే కొబ్బరి నీళ్లకన్నా కూడా మీరు డబుల్ ధరలో అమ్మినా కొంటారు. రోజు కనీసం రూ.1500 వరకు మీ వ్యాపారం కొనసాగినా నెలకు రూ.40 వేల కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఇలానే కొనసాగితే మీ వ్యాపారానికి మంచి ఆదరణ లభించి నెలకు 70 వేలు కూడా సంపాదించవచ్చు.