Business Idea : మీరు తక్కువ ఖర్చులతో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీకు సహాయం చేయడానికి ఈ రోజు మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించిన వివరాలు చూద్దాం. ఈ వ్యాపారం ద్వారా మీరు ఇంట్లోనే ఉండి. భారీగా సంపాదించుకునే అవకాశం. దీని కొరకు మీరు మార్కెట్లో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఉదయం అల్పాహారం మనకు చాలా ముఖ్యం. రోజుంతా మనం తినే ఆహారంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఈ రోజు అటువంటి వ్యాపారం గురించి మాట్లాడుతున్నాము. ఇది లేకుంటే ప్రజల అల్పాహారం అసంపూర్ణంగా ఉంటుంది. అదే పోహా తయారీ యూనిట్. దీని డిమాండ్ ప్రతి సీజన్లో లో మరియు ప్రతి నెలలో ఉంటుంది.
ఈ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. గత కొంతకాలంగా పౌష్టికాహారంపై ప్రజలకి చాలా అనగాహన ఏర్పడింది. పోహ ఒక మంచి పోషకమైన ఆహారంగా పరిగణించబడుతుంది ఉదయం లేదా సాయంత్రం అల్పాహారం కొరకు ఇది ఒక గొప్ప ఎంపిక రెండింటిని తయారు చేసి తినడం సులభంగా ఉంటుంది. మార్కెట్లో పోహా తయారి వేగంగా పెరగటానికి ఇదే కారణం. ఇటువంటి పరిస్థితిలో మీరు పోహా తయారీని ఏర్పాటు చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఖాదీ , విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ నివేదిక ప్రకారం, పోహా తయారీ యూనిట్ సుమారు రూ. 2.43 లక్షలు. దీనిలో 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో పోహా తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు సుమారుగా రూ. 25,000 ఏర్పాటు చేసుకోవాలి.
Business Idea : కొద్ది ముడిసరుకుతో ప్రారంభించండి
ఈ వ్యాపారం ప్రారంభించడానికి సుమారుగా ఉ. 500 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. పోహా యంత్రం, కొలిమి, ప్యాకింగ్ యంత్రం మరియు డ్రమ్ సహా చిన్న వస్తువులు అవసరం అవుతాయి. ఆపై క్రమంగా దానిని పరిమాణాన్ని మరియు అమ్మకాల ప్రకారం పెంచండి. అనుభవం కూడా వస్తుంది. దీంతో వ్యాపారం కూడా పెరుగుతుంది. లాభం కూడా వస్తుంది.ఈ వ్యాపారం కోసం ప్రభుత్వం నుండి కూడా రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసి, గ్రామ పరిశ్రమల ఉపాధి పథకం కింద రుణం కొరకు దరఖాస్తు చేస్తే దాదాపు 90 శాతం రుణాన్ని పొందుతారు.
Business Idea : మీరు ఎంత సంపాదిస్తారు?
ప్రాజెక్ట్ ప్రారంభించిన తరువాత మీరు ముడి పదార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 6 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కాక సుమారు 50 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విధానంగా మీరు సుమారు 1000 క్వింటాళ్ల పోహా ఉత్పత్తి చేస్తారు. దీనిపై ఉత్పలు వ్యయం రూ. 8.60 లక్షలు 1000 క్వింటాళ్ల పోహాను సుమారు రూ. 10 లక్షలకు అమ్మవచ్చును. అంటే దాదాపుగా రూ. 1.40 లక్షలు సంపాదించుకోవడం జరుగుతుంది.