Smart TV : స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు ధరలతో..!

Smart TV : ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి వస్తువు కూడా నిత్యవసరంగా మారిపోయింది. అలాంటప్పుడు మనం ప్రతి విషయంలో కూడా కాస్త అడ్వాన్స్ గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలో హుందాగా జీవించవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు . ఇక ఈ క్రమంలోని ప్రతీదీ కూడా స్మార్ట్ గా ఉండాలని ఆలోచిస్తున్న ప్రజలు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నారు. మీరు కూడా ఒక మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ అయినటువంటి ఎల్జీ నుంచి స్మార్ట్ టీవీ లను తక్కువ ధరలకే అదిరిపోయే ఆఫర్లతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఇక ఎల్జి అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీలు 32 ఇంచుల నుంచి 65 ఇంచుల వరకు స్క్రీన్ పరిమాణాలతో లభిస్తూ ఉండడం గమనార్హం .

ముఖ్యంగా అనేక ఓటిటి చానల్స్ కు ఈ స్మార్ట్ టీవీలు మద్దతు ఇస్తూ ఉండడం కారణంగా ప్రజలు కూడా ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఎల్జీ స్మార్ట్ టీవీ ఆఫర్స్ మంచి సౌండ్ క్వాలిటీతో కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలు మీ ఇంట్లో ఉంటే థియేటర్ అనుభూతి పొందవచ్చు అని వినియోగదారులు కూడా తెలియజేస్తున్నారు. ఇక వీటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Bumper offer for those who want to buy Smart TV
Bumper offer for those who want to buy Smart TV

ఎల్జి 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : 32 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ మంచి హెచ్డి క్వాలిటీతో వీడియో తో సినిమాలను ప్లే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక ఇందులో అన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందించారు. కస్టమర్ల నుంచి 4.5 యూజర్ రేటింగ్ కూడా ఈ స్మార్ట్ టీవీలకు లభించింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలో ఒక యూఎస్బీ పోర్టుతో పాటు రెండు హెచ్డిఎంఐ పోర్ట్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎల్జి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ : ఎల్జీ కంపెనీ అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీ మనకు 43 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో లభిస్తుంది. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ పూర్తి హై డెఫినిషన్ క్వాలిటీని కలిగి ఉంటుంది . 50 Hz రిఫ్రెష్ రేట్ తో మనకు లభిస్తుంది.

ఎల్జి 50 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ : 50 ఇంచుల స్క్రీన్ పరిమాణం కలిగిన ఈ స్మార్ట్ టీవీ 4k నాణ్యతతో వీడియోలను చూడవచ్చు. ఇది 2.0 ఛానల్ తో కూడిన స్పీకర్ ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా మీ సంగీత అనుభవాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఈ స్మార్ట్ టీవీ ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీలు అమెజాన్ అలాగే ఫ్లిప్ కార్ట్ లో సరసమైన ధరలకే లభిస్తూ ఉండడం గమనార్హం.