BSNL Recharge Plans : అన్ లిమిటెడ్ డేటా తో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ తో వచ్చిన బిఎస్ఎన్ఎల్ ..!!

BSNL Recharge Plans : భారత్ సంచార్ నిగం లిమిటెడ్ .. ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ తాజాగా తమ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని అసలు సిసలైన అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక అన్ని రేంజ్ ధరలలో విభిన్నమైన బెనిఫిట్స్ తో చాలా ప్రీపెయిడ్ ప్లాన్లను అందివ్వడానికి సిద్ధమయ్యింది. ముఖ్యంగా ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ లో తక్కువ ధరలకు రీఛార్జి ప్లాన్స్ అందిస్తూ ఉండడం గమనార్హం. ఒకవేళ మీ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ 3జి నెట్వర్క్ సరిపడనంత ఉంటే కొన్ని ప్లాన్స్ చాలా బాగా సూట్ అవుతాయి. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఒక ప్లాన్ మాత్రం చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఇతర ఏ టెలికాం ఆపరేటర్ కూడా ఇలాంటి బెనిఫిట్స్ తో ప్లాన్లను అందివ్వడం లేదు. ఇక మీ ప్రాంతం నెట్వర్క్ కి సరిపడినంత ఉంటే ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ డేటా తో ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఆ ప్లాన్ ఏమిటి? రీఛార్జ్ బెనిఫిట్స్ ఏమిటి ? ఇలా ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.398 బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ మినహాయిస్తే ఏ టెలికాం సంస్థ కూడా ఇంత అద్భుతమైన ఆఫర్లను అందివ్వడం లేదు. బిఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ తీసుకుంటే అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ డేటా అంటే రోజూ వారీ GB చొప్పున లిమిట్ ఏమీ ఉండదు. రోజులో ఎంత డేటా అయినా సరే హై స్పీడ్ లో పొందవచ్చు. సాధారణంగా ప్లాన్స్ లో అయితే రోజు కేటాయించిన డేటా తర్వాత చాలా తక్కువ స్పీడ్ లో డేటా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. నిజమైన అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది.

BSNL Recharge Plans on Unlimited data
BSNL Recharge Plans on Unlimited data

అంతేకాదు ఇలా రోజులో ఎంత హై స్పీడ్ డేటా అయినా మీరు వాడుకొని ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇస్తున్న ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కావడం గమనార్హం. అయితే వోడాఫోన్ ఐడియా రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్ వద్ద ఇలాంటి బెనిఫిట్ ను అందిస్తోంది. ఒకవేళ మీ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పుష్కలంగా ఉంటే రూ.398 రీఛార్జి ప్లాన్ ఫుల్ పైసా వసూల్ గా ఉండబోతోంది. ఇకపోతే బిఎస్ఎన్ఎల్ 3జి నెట్వర్క్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదే సంవత్సరంలో 4జి నెట్వర్క్ లాంచ్ చేయాలని బిఎస్ఎన్ఎల్ భావిస్తుంది.