BSNL Paisa Vasool Offer : ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ అయినటువంటి భారత సంచార్ నిగం లిమిటెడ్ తమ యూజర్ల కోసం రూ.500 లోపు ధరలో రెండు మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్స్ ను తీసుకువస్తుంది . ఇక సాధారణంగా ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ కాస్త తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నుంచి మనకు 3G నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉండడంతో కస్టమర్లు కొంచెం వెనకడుగు వేస్తున్నారు. కానీ అన్లిమిటెడ్ టాక్ టైం కోసం ఎదురుచూసే వారికి బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్లను తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదు..
ఒకవేళ మీ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ 3G నెట్వర్క్ పుష్కలంగా ఉన్నట్లయితే ఈ ప్లాన్స్ మీకు ఫుల్ పైసా వసూల్ గా రాబోతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్స్ మీకు రూ.500 లోపే లభించడమే కాదు.. సరిపడేంత డేటా తో పాటు 80 రోజులకు పైగా వ్యాలిడిటీని అలాగే మిగిలిన బెనిఫిట్స్ మీకు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మొదటి ప్లాన్ విషయానికి వస్తే.. రూ.485 ప్లాన్.. ఈ ప్లాన్ మీకు మంచి ప్రయోజనాలతో లభిస్తోంది. ఈ ప్లాన్ తో మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే 82 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 1.5 జిబి చొప్పున హై స్పీడ్ 3G డేటాను పొందవచ్చు. ఇక అంతే కాదు ఏ నెట్వర్క్ కి అయినా సరే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందడంతో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు.
ఇక రోజువారి 1.5 GB డేటా అయిపోతే 40 కేబీపీఎస్ డేటా వేగంతో ఇంటర్నెట్ ను మీరు వాడుకోవచ్చు. రూ.499 రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే 80 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక అంతేకాదు ప్రతిరోజు 2GB డేటా తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను వాడుకునే అవకాశం ఉంటుంది . ఇక అంతేకాదు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ తో పాటు జింగ్, ఎరోస్ నౌ వంటి ఓటీడీల సబ్స్క్రిప్షన్ ని కూడా మీరు పొందవచ్చు. ఇక రూ.499 ప్లాను మీకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్న నేపథ్యంలో కస్టమర్లు దీనిని ఎంచుకోవడమే ఉత్తమం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా కొత్తగా ఫుల్ పైసా వసూల్ ప్లాన్ తో ముందుకు వచ్చింది బిఎస్ఎన్ఎల్..