BSNL : భారతీయ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్.. ప్లాన్ వ్యాలిడిటీ ఒక నెలపాటు ఉండడంతోపాటు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అలాగే ఈ ప్లాన్ ను ఇంటి కోసం అలాగే ఆఫీస్ కోసం రెండింటికి కలిపి తీసుకునే అవకాశాన్ని కల్పించబడింది బిఎస్ఎన్ఎల్. ఆజాదీ అమృత్ మహోత్సవ్ ఆఫర్ కింద బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకే రీఛార్జి ప్లాన్స్ ను ప్రకటించింది. మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్ : ఇది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో చాలా ఎక్కువ డేటా కావాలనుకునే వారి కోసం బిఎస్ఎన్ఎల్ ప్రత్యేకంగా ఈ ప్లాను తీసుకువచ్చింది బిఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్ ద్వారా 300జిబి డేటా, 10 mbps స్పీడుతో వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక నెల రోజులు ఉంటుంది. అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ఆఫీస్ , ఇల్లు రెండింటి కోసం ఈ ప్లాన్ తీసుకోవచ్చు.
రూ.599 ప్లాన్ ఇప్పుడు కేవలం రూ.275 కే.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా కొద్ది రోజులు ఈ ప్లాన్ అందుబాటులో ఉండబోతోంది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది బిఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం దీని ధర కేవలం రూ.275 మాత్రమే. అయితే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ మూడు నెలల ప్లాన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్ కింద మీరు రూ.449 , రూ.599, రూ.999.. ఇందులో ఏదైనా ఒక ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లాన్ ను మీరు కేవలం రూ.275కే సొంతం చేసుకోవచ్చు.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు సూచనలు ఇచ్చింది. అంతేకాదు కొత్తగా ఎవరైనా BSNL లోకి చేరాలనుకునే వారికి కూడా ఈ అద్భుతమైన బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు ఒకవేళ రాజస్థాన్ కస్టమర్ అయితే ట్విట్టర్ హ్యాండిల్ నుండి బిఎస్ఎన్ఎల్ ఇలా ఒక సమాచారాన్ని అందించింది. ఆఫీస్ , ఇల్లు రెండింటి కోసం ప్లాన్ తీసుకోవాలని అనుకునేవారు 9414024365 అనే నెంబర్కు రిజిస్టర్ బిఎస్ఎన్ఎల్ నెంబర్ నుంచి వాట్సప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు. ఇక అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ మరింత ప్రయోజనాలు అందించడానికి ఈ క్రమంలోనే మన ముందుకు రానుంది..అంతేకాదు ప్రస్తుతం 3G నెట్వర్క్ ను అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ త్వరలోనే 4G నెట్వర్క్ ను కూడా ప్రవేశపెట్టబోతోంది.