Brother Sister Love Story : ఈ రోజుల్లో ప్రేమికులు కులం మతం మాత్రమే చూడట్లేదు అనుకుంటే పొరపాటే.. వావి వరసలు కూడా చూడట్లేదు అందుకు ఈ ప్రేమ జంట నిదర్శనం.. అదే విషయం పెద్దవాళ్లు నచ్చజెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రేమ జంట ఊహించని నిర్ణయం తీసుకున్నారు..
ఈ ఘటన తెలంగాణాలోని నారాయణపేట్ జిల్లాలో చోటు చేసుకుంది. కూలి పనుల కోసం వలస కూలీలు వచ్చిన కుటుంబాలలోని 25 ఏళ్ల కుర్రాడు అదే పని మీద వచ్చిన మరొక కుటుంబంలోని 15 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ పక్క పక్కనే వున్న పని నిమిత్తమే కాకుండా, వారి మధ్య బంధుత్వం కూడా వుంది. వరుసకు అక్షరాలా అన్నా చెల్లెళ్లు అవుతామని తెలిసీ ఆ యువతీ, యువకుడు ప్రేమలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లి తండ్రులు ఇది తప్పని నచ్చచెప్పరు. కానీ వాళ్ళు అర్ధం చేసుకోలేదు. ఒకరిని విడిచి మరొకరు వుండలేని స్థితికి వచ్చేశారు. ఇక ఈ జంట ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. దూరంగా వెళ్లి బతికినా లాభం లేదనుకున్నారో ఏమో, రైలు పట్టాల కింద తల పెట్టి ప్రాణం తీసుకున్నారు. ఇప్పుడీ అన్నాచెల్లెళ్ల ప్రేమ చావు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..