నేడు వివాహ వివాదంపై విచారణ సందర్భంగా, ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా సమస్యలతో తన ముందుకు వచ్చిన ఒక కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహంలోని సమస్యలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించాలని కోర్టు సూచించింది. అయితే భర్త అంగీకరించలేదు.
కాగా, ఇటీవలి తీర్పు ఆధారంగా, అతని అనుమతి లేకుండా కూడా విడాకులు మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. కానీ విడాకులు ఇవ్వడమే పరిష్కారం కాదు కాబట్టి మళ్లీ మధ్యవర్తిత్వం కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది.