Breaking: వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు రిలీజ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి జనవరి నుంచి మార్చి మధ్యలో పెళ్లి చేసుకున్న వారికి తీపి కబురు అందించారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. జనవరి–మార్చి నెలలలో పెళ్లి చేసుకున్న లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద అర్హులైన 12,132 మందికి రూ.87.32 కోట్ల డబ్బులను బటన్ నొక్కి విడుదల చేశారు.

దాంతో కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.1 లక్ష నగదు జమ అయ్యింది. ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్న వారికి రూ.1.2 లక్షలు, బీసీ వర్గాల వారికి రూ.50 వేలు, బీసీల్లో కులాంతర పెళ్లి చేసుకున్న వారికి రూ.75 వేలు, హ్యాండీక్యాప్డ్ వ్యక్తులకు 1.5 లక్షలు అందజేశారు. ఇక భవన కార్మికులకు రూ.40 వేలు వధువు తల్లి ఖాతాలో నేరుగా డిపాజిట్ చేశారు.

ఇంతకుముందు ఈ డబ్బులను వధువు ఖాతాలో నేరుగా డిపాజిట్ చేసేవారు. అయితే కొందరి అభ్యర్థుల మేరకు ఈ డబ్బులను వధువు తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా పూర్తి స్థాయిలో పారదర్శకత ఉండేలా జగన్ సర్కారు ఈ నిర్ణయాలను అమలు చేస్తోంది.