Breaking: కర్ణాటకలో బస్సు కండక్టర్‌తో టికెట్ కొననని మహిళ గొడవ..

కర్ణాటక స్థానికులైన మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా, బీఎంటీసీ నాన్-AC బస్సులు, రాష్ట్ర రవాణా సంస్థ బస్సులలో ఫ్రీగా ప్రయాణాలను చేయవచ్చని M సిద్దరామయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా బస్ కండక్టర్లు మహిళల వద్ద బస్సు టికెట్ కి ఛార్జీ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక మహిళ కండక్టర్‌కి డబ్బులు ఇవ్వనంటే ఇవ్వనని గొడవ పెట్టుకుంది.

Advertisement

కర్నాటకలో బస్సు కండక్టర్‌తో ఆమె గట్టిగా తాను టికెట్ కొననని కరాకండిగా చెప్పేసింది. “మేం డబ్బు ఎందుకు చెల్లించాలి, వారు మహిళలకు ఎందుకు బస్సు ప్రయాణాలను ఉచితంగా ప్రకటించారు, వారికి ఏమైనా పిచ్చి ఉందా” అని ఆమె అరవడం ఒక వైరల్ వీడియోలో కనిపించింది.

Advertisement

Advertisement