ఒక సైంటిఫిక్ కాంగ్రెస్‌లో సమర్పించిన తాజా స్టడీ సంచలన విషయాలను బయట పెట్టింది. గుండెపోటు తర్వాత మరణించే అవకాశం పురుషుల కంటే స్త్రీలలోనే రెండింతలు ఎక్కువ అని పేర్కొంది. ఈ అధ్యయనం స్త్రీలు, పురుషులలో గుండెపోటు వచ్చిన తర్వాత ఫలితాలను పోల్చింది. ఆ డేటా విశ్లేషించిన పరిశోధకులు మహిళలలో స్వల్ప, దీర్ఘకాలంలో మరణాలు ఎక్కువ అని తేల్చారు. అలానే ప్రధాన హృదయనాళ వ్యాధులతో సహా ప్రతికూల ఫలితాల ముప్పు అధికమవుతుందని పేర్కొన్నారు. ఇతర కారకాలకు సర్దుబాటు చేసిన తర్వాత కూడా, మహిళలలో చనిపోయే ముప్పు ఎక్కువగా ఉంది.
వైవిధ్య లక్షణాలు, జన్యు సిద్ధత వంటి అంశాలు ఈ అసమానతకు దోహదం చేస్తాయని పరిశోధకులు సూచించారు. గుండె జబ్బులు ఉన్న మహిళలకు ఫలితాలను మెరుగుపరచడానికి మరింత అవగాహన, పరిశోధన అవసరాన్ని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది.