Breaking: పోరాట కమిటీ నాయకులే యాజమాన్యంతో కుమ్మక్కయ్యారు: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం గురించి అందరికీ తెల్సిందే. ఎప్పుడైతే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని ప్రకటించిందో ఇక అప్పటినుండి నిరసన సేవలు వెల్లువెత్తాయి. ఆ నిరసన సెగలకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రైవేటీకరణ విధానాన్ని పొడుగించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను దాఖలు చేయడానికి విధించిన గడువును పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తోంది. ఆశించిన స్థాయిలో బిడ్స్ దాఖలు కాకపోవడం వల్ల కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను దాఖలు చేయడానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇంకా ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనేలా చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది ఆర్ఐఎన్ఎల్. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి తమ నిరసన సెగలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పోరాట కమిటీ నాయకులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా అడ్మిట్ భవనంలోకి వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డగించారు.